ETV Bharat / entertainment

Review: 'కేజీఎఫ్'కి దీటుగా 'కేజీఎఫ్​ 2'.. ఇక బాక్సాఫీస్​ బద్దలే! - కేజీఎఫ్​ 2 మూవీ రిలీజ్​ డేట్

Yash KGF 2 movie review: భారీ అంచనాలతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్​ 2'. ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..

Yash KGF 2 movie review
కేజీఎఫ్​ 2 మూవీ రివ్యూ
author img

By

Published : Apr 14, 2022, 12:05 PM IST

Updated : Apr 14, 2022, 1:10 PM IST

చిత్రం: కేజీఎఫ్‌: ఛాప్టర్‌-2; నటీనటులు: యశ్‌, శ్రీనిధి శెట్టి, సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, అచ్యుత్‌కుమార్‌, మాళవిక అవినాశ్‌ తదితరులు; సంగీతం: రవి బస్రూర్‌; సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ; ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి; నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌; రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌; విడుదల: 14-04-2022

Yash KGF 2 movie review: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌2’ ఒకటి. కన్నడ సినిమాగా విడుదలైన పాన్‌ ఇండియా మూవీగా రికార్డులు సృష్టించింది ‘కేజీఎఫ్‌-1’. కథా నేపథ్యం, యశ్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కథానాయకుడిగా పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం కట్టిపడేసింది. తొలి భాగానికి, రాఖీభాయ్‌ పాత్రకూ ప్రత్యేకంగా ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడిందంటే ఆ సినిమా ప్రేక్షకులకు ఎంత చేరువైందో అర్థం చేసుకోవచ్చు. తొలి భాగానికి కొనసాగింపుగా భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘కేజీఎఫ్‌-2’. మరి ఆ అంచనాలను అందుకుందా? గరుడను చంపిన తర్వాత రాఖీభాయ్‌ కేజీయఫ్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు? అధీర, రమికాసేన్‌, ఇనాయత్‌ ఖలీలను ఎలా ఎదుర్కొన్నాడు?ప్రశాంత్‌ నీల్‌ ఈ కథను ఎలా ముగించాడు?

క‌థేంటంటే: ముంబై నుంచి కేజీఎఫ్ (న‌రాచీ) సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ (య‌శ్‌) పేరుకి గ్యాంగ్‌స్ట‌రే కానీ, అక్క‌డి ల‌క్ష‌ల మంది సామాన్య ప్ర‌జ‌ల‌కి దేవుడిగా మార‌తాడు. వాళ్లంతా రాఖీ సామ్రాజ్యం కోసం ఓ ప్రైవేటు సైన్యంలా ప‌నిచేస్తారు. నిర్విరామంగా బంగారం నిక్షేపాల్ని వెలికి తీయ‌డం, దాంతో వ్యాపారం చేయ‌డం ఇదే రాఖీ ప‌ని. ల‌క్ష‌ల మంది సైన్యం, వంద‌ల వాహ‌నాలు, హెలికాఫ్ట‌ర్లు, ఓడ‌లు రాఖీ సొంతం. శ‌త్రుదుర్బేధ్య‌మైన కేజీయఫ్ గురించి సీబీఐ ద్వారా ప్ర‌ధాన‌మంత్రి ర‌మికాసేన్ (ర‌వీనాటండ‌న్‌)కి తెలుస్తుంది. దాంతో ఎలాగైనా రాఖీని అంతం చేయాల‌ని ర‌మికా నిర్ణ‌యిస్తుంది.మ‌రోప‌క్క కొండ‌ల్ని సైతం పిండి చేయగల అధీరా (సంజ‌య్‌ద‌త్‌) కేజీయఫ్‌ను త‌న సొంతం చేసుకునేందుకు త‌న సైన్యంతో రంగంలోకి దిగుతాడు. ఒక ప‌క్క ప్ర‌భుత్వంతోనూ, మ‌రోప‌క్క అధీరాతోనూ రాఖీభాయ్ పోరాటం ఎలా సాగింద‌న్న‌దే సినిమా.

ఎలా ఉందంటే: ‘బాహుబ‌లి ది బిగినింగ్’ చూసినవాళ్లంతా, కన్‌క్లూజ‌న్ కోసం ఎంత‌గా ఎదురు చూశారో... అంత‌గా ప్రేక్ష‌కుల్ని ఆత్రుత‌కి గురిచేసిన చిత్ర‌మిది. కార‌ణం రాఖీభాయ్ పాత్రే. జీరో నుంచి హీరోగా ఎదిగిన రాఖీ పాత్ర‌తో ప్రేక్ష‌కులు అంత‌గా క‌నెక్ట్ అయ్యారు. గరుడ‌తో స‌హా ఎంతోమందిని ఓడించి న‌రాచీలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ త‌న సామ్రాజ్యాన్ని శ‌త్రువుల నుంచి ఎలా కాపాడుకున్నాడు? అస‌లు అత‌ని గ‌త‌మేంటి? అనే విష‌యాలు ఛాప్ట‌ర్ 2పై ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగానే సినిమా ఆరంభ‌మ‌వుతుంది. ఆనంద్ వాసిరాజు త‌న‌యుడు విజ‌యేంద్ర వాసిరాజు ఛాప్ట‌ర్ 2 క‌థ‌ని చెప్ప‌డం మొద‌లు పెడ‌తాడు. న‌రాచీలో గ‌రుడని చంపాక మిగిలి ఉన్న శ‌త్రువుల్ని రాఖీ ఎలా భ‌య‌పెట్టాడు? అక్క‌డ ప్ర‌జ‌ల‌కి ఎంతగా ద‌గ్గ‌ర‌వుతాడనే అంశాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. తొలి భాగంలో హీరో ఎదిగే క్ర‌మంతోపాటు, ఎలివేష‌న్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ఛాప్ట‌ర్- 2లో మాత్రం హీరో ఎలివేష‌న్స్‌పైనే దృష్టిపెట్టాడు ద‌ర్శకుడు. అవి ఏ స్థాయికి వెళ్లాయంటే రాఖీ నేరుగా ప్ర‌ధాన‌మంత్రి ద‌గ్గ‌రికి వెళ్లి వార్నింగ్ ఇవ్వ‌డం మొద‌లుకొని... పార్ల‌మెంట్‌లోకి వెళ్లి ఎంపీని కాల్చేసే వ‌ర‌కు! ఈ స‌న్నివేశాలు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడు కేజీయఫ్ ప్రియుల్ని మెప్పించేందుకు ఎంత స్వేచ్ఛ‌ని తీసుకోవాలో అంత తీసుకుని స‌న్నివేశాల్ని మ‌లిచాడు. ప్ర‌తీ స‌న్నివేశం రిచ్‌గా, స్టైలిష్‌గా క‌నిపిస్తుంటుంది. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని విజువ‌ల్స్‌తో ఆవిష్క‌రించిన తీరు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత కిక్‌నిస్తుంది.

కేజీఎఫ్ సామ్రాజ్యంతోపాటు రాఖీ శ‌త్రువుల గురించి ప్రేక్ష‌కుల‌కు ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డ‌టం... రెండో భాగంలోని క‌థ‌లో మ‌లుపులు కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డం సినిమాకి కాస్త మైనస్‌. అధీరా ఎలా తిరిగొచ్చాడు? ఇంత కాలం ఏమయ్యాడ‌నే అంశాలు మాత్రం ఇందులో ఉండ‌వు. కేజీయఫ్ కోసం చ‌చ్చిన‌వాళ్లు మ‌ళ్లీ బ‌తికొస్తార‌నే ఓ చిన్న డైలాగ్‌తో ఆ పాత్ర‌కి జ‌స్టిఫికేష‌న్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, రాఖీ వ‌ర్సెస్ అధీరా మ‌ధ్య యుద్ధం పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. రాఖీ గ‌తాన్ని, త‌ల్లి సెంటిమెంట్‌ని చిన్న చిన్న ముక్క‌లుగా చూపించారు. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ చిగురించే తీరు మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉంటుంది. ర‌మికా సేన్‌కీ, రాఖీకీ మ‌ధ్య స‌న్నివేశాలు సంఘ‌ర్ష‌ణ బాగుంది. ప‌తాక స‌న్నివేశాలు కేజీయఫ్ ప్రియుల‌కి మ‌రింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంటాయి. నిర్మాణ విలువ‌లు సినిమాని మ‌రోస్థాయికి తీసుకెళ‌తాయి.

ఎవ‌రెలా చేశారంటే: రాఖీ భాయ్‌గా య‌శ్ మ‌రోసారి అల‌రించాడు. హీరోయిక్‌గా క‌నిపించ‌డంతో పాటు, యాక్ష‌న్ ఘ‌ట్టాల్లోనూ అల‌రించాడు. కొన్నిచోట్ల భావోద్వేగాల్ని ప‌లికించిన తీరు కూడా మెప్పిస్తుంది. క‌థానాయిక రీనా (శ్రీనిధి శెట్టి) పాత్ర‌కి త‌గిన ప్రాధాన్య‌మే ల‌భించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర నేప‌థ్యంలో చ‌క్క‌టి భావోద్వేగాలు పండాయి. సంజ‌య్‌ద‌త్ అధీరాగా క‌నిపించిన తీరు బాగుంది. కానీ, ఆయ‌న పాత్ర‌కి జోడించిన బ‌లమే స‌రిపోలేదు. ర‌మికాసేన్ పాత్ర‌ని తెర‌పైకి తీసుకురావ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఆ పాత్ర‌లో ర‌వీనాటాండ‌న్చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. రావు ర‌మేష్‌, ఈశ్వ‌రీరావు , ప్ర‌కాశ్‌రాజ్ త‌దిత‌రుల పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే ప్రాధాన్యంతో కూడుకున్నవే.

సాంకేతిక విభాగాలు.. అత్యుత్త‌మ ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ర‌వి బస్రూర్ నేప‌థ్య సంగీతం హీరోయిజాన్ని మ‌రింత హైలైట్ చేసింది. భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కేజీయఫ్ గ‌నుల్ని చూపించిన తీరు చాలా బాగుంటుంది. హాలీవుడ్ సినిమాల్ని ఏమాత్రం తీసిపోని రీతిలో స‌న్నివేశాలు క‌నిపిస్తాయి. మాట‌లు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు అడుగ‌డుగునా క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు కేజీఎఫ్ ఛాప్ట‌ర్‌1కి దీటుగా రెండో ఛాప్ట‌ర్‌ని తెర‌కెక్కించారు. హంగుల వ‌ర‌కు ప‌ర్వాలేదు కానీ, క‌థ‌నం ప‌రంగా కాస్త గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది.

బ‌లాలు

+ రాఖీభాయ్ హీరోయిజం

+ న‌రాచీ సామ్రాజ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు

+ నిర్మాణ విలువ‌లు

+ ఛాయాగ్ర‌హ‌ణం.. సంగీతం

బ‌ల‌హీన‌త‌లు

- గంద‌ర‌గోళంగా అనిపించే క‌థ‌నం

చివ‌రిగా: కేజీఎఫ్ ఛాప్ట‌ర్‌-1కి దీటుగా ఛాప్ట‌ర్‌2

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చూడండి: 'కేజీఎఫ్​ 2' రివ్యూ.. ప్రేక్షకులకు పూనకాలే.. త్వరలోనే 'కేజీఎఫ్​ 3'!

Last Updated : Apr 14, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.