Vishal Censor Board : కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే చాలా కాలం తర్వాత మార్క్ ఆంటోనీతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సెన్సార్ జారీ చేసే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోని' విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి మాట్లాడుతూ ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ ట్వీట్ చేశారు.
"అవినీతి గురించి స్క్రీన్‌పై చూడడం వరకు ఓకే గానీ రియల్ లైఫ్‌లో జరగడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ముఖ్యంగా గవర్న్మెంట్ ఆఫీసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయి సెన్సార్ ఆఫీస్‌లోనూ ఇదే కొనసాగుతోంది. నా మార్క్ ఆంటోని మూవీ హిందీ వెర్షన్ సెన్సార్ వర్క్ పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలను ఇచ్చాను. స్క్రీనింగ్ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ. 3 లక్షలు లంచంగా ఇచ్చాను. నా కెరీర్లో ఇలాంటి పరిస్థితిని అస్సలు ఎప్పుడూ చూడలేదు. వేరే దారిలేక ఈ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతలకూ ఇలా జరగకూడదని అనుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఆర్జించిన డబ్బు ఈ విధంగా పోయే ఛాన్సే లేదు! న్యాయం గెలుస్తుంది అని భావిస్తున్నాను" అని విశాల్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పారు. ఈ మేరకు మోదీ, శిందే ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. ఎవరెవరికి తాను డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలను ట్వీట్లో పోస్ట్ పెట్టారు.
Vishal Mark Antony : కాగా, విశాల్, ఎస్.జే. సూర్య ప్రధాన పాత్రల్లో మార్క్ ఆంటోనీ తెరకెక్కింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించారు. టైమ్ ట్రావెల్ అండ్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఈ నెల 15న గ్రాండ్‌గా రిలీజైంది. హిందీలో నేడు(సెప్టెంబర్ 28) మూవీ రిలీజైంది. ఈ క్రమంలోనే హిందీ వెర్షన్‌కు సెన్సార్ చేయించే క్రమంలోనే అధికారులు లంచం తీసుకున్నారని విశాల్ ఆరోపణలు చేశారు.
-
#Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l
— Vishal (@VishalKOfficial) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l
— Vishal (@VishalKOfficial) September 28, 2023#Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l
— Vishal (@VishalKOfficial) September 28, 2023
Sakshi Agarwal Latest Photos : అదిరే ఒంపు సొంపులతో బిగ్ బాస్ బ్యూటీ అందాల రచ్చ.. ఒక్కసారి చూస్తే..