సుమారు పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల తాను మీడియాకు దూరమయ్యానని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలిపారు. తన తదుపరి చిత్రం ‘బీస్ట్’ ప్రమోషన్స్‌లో భాగంగా చాలా సంవత్సరాల తర్వాత తొలిసారి మీడియా ఎదుటకు వచ్చారు. చిత్ర దర్శకుడు నెల్సన్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. అందులో ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకొన్నారు. ఆయన మాటల్లో మీకోసం..
పదేళ్లు దూరం..!
ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా సమయం లేనంత బిజీగా నేను లేను. ఇంటర్వ్యూలు ఉంటే దానికంటూ సమయం కూడా కేటాయించగలను. కానీ, సుమారు 10, 11 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. నేను ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా అనుకోవచ్చు. అప్పట్లో నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దానిని వారు మరోలా అన్వయించుకొని రాసుకున్నారు. అది వివాదాస్పదంగా మారింది. కొంతకాలం ప్రెస్‌కు దూరంగా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అది కాస్త చాలా గ్యాప్ వచ్చేలా చేసింది. ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు చెప్పలేను. కానీ, నేను మాట్లాడిన దాన్ని వాళ్లు వివాదాస్పదమయ్యేలా రాశారు. తర్వాత రోజు పేపర్లో వార్తలు చూసి.. 'నేనేనా? ఇలా మాట్లాడింది?' అని షాకయ్యా. నా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా.. 'నువ్వు ఇలా మాట్లాడావంటే నమ్మలేకపోతున్నాం' అన్నారు. వాళ్లకు జరిగింది చెప్పాను. ఇంట్లో వాళ్లకు చెప్పగలను. కానీ, అందరికీ జరిగిన విషయం చెప్పడం కష్టం కదా. అలా పదేళ్లు మీడియాకు దూరంగా ఉన్నా.
సైకిల్‌పై ఎందుకు వెళ్లానంటే..!
గతంలో ఓ ఎన్నికల్లో ఓటు వేయడానికి నేను సైకిల్‌పై వెళ్లడం అంతటా చర్చనీయాంశమైంది. అందరూ దాని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. నిజం చెప్పాలంటే, పోలింగ్ బూత్ మా ఇంటి వెనుకనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు రాగానే నా కుమారుడు.. ‘పక్కనే కదా. సైకిల్‌పై వెళ్లు’ అన్నాడు. సరే అని నేను సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లాను. ఇంతలా రియాక్షన్ ఉంటుందని భావించలేదు. ఇదిలా ఉంటే నేను సైకిల్‌పై రావడం చూసి అందరూ వార్తలు రాసేసుకున్నారు. టీవీల్లో లైవ్ ప్రసారం చేశారు. అది చూసి నా కుమారుడు నాకు ఫోన్ చేసి.. ‘‘నా సైకిల్ బాగానే ఉందా’’ అని అడిగాడు. వాడు అలా అడిగే సరికి నవ్వొచ్చింది.
అన్నీ ఫాలో అవుతా..!
గతంలో నేను సినిమా వార్తలు మాత్రమే చదివేవాడిని. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ పైనే ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. కానీ, ఇప్పుడు నేను అన్నిరకాల వార్తలు చదువుతుంటాను. అన్నీ ఫాలో అవుతుంటాను. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల అధికారులు చక్కగా పనిచేస్తున్నారు. ఇటీవల ఓ గ్రామంలో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ బుల్లెట్ పక్కనే ఉన్న బాలుడికి తగిలి అతను మృతువాత పడినట్లు తెలుసుకొన్నాను. పిల్లలకు, చుట్టపక్కల వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే షూటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన సెంటర్‌ని జనావాసాలకు దూరంగా ఉండేలా చూసుకుంటే బాగుండేదనిపించింది.
దేవుడ్ని నమ్ముతా..!
నేను దేవుడ్ని నమ్ముతాను. నాకు దైవభక్తి ఉంది. నేను హిందువుల గుడికి వెళ్తాను. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాను. అలాగే దర్గా కూడా వెళ్తాను. నా భార్యాపిల్లలు కూడా ఆ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్లడం సాధ్యంకాలేదు. అందుకే విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన ఆలయాలకు వెళ్లి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని వస్తా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Pranitha: తల్లికాబోతున్న నటి ప్రణీత