సాధారణంగా సినిమాలకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రీలీజవ్వడానికి ముందు నుంచే సంబరాలు మొదలుపెట్టే ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్-షోలో క్రాకర్స్ పేల్చడం నుంచి ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్ చేసేవరకూ సందడి చేస్తూనే ఉంటారు. తమ అభిమాన తారల సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఎన్నో పనులు చేస్తుంటారు. అయితే అభిమానులతో పాటు స్టార్స్ కూడా ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పాల్గొంటుంటారు. ఇందులో భాగంగా ఓ వైపు టీజర్, ఆడియో ట్రైలర్ లాంచ్ లాంటి కార్యక్రమలను నిర్వహిస్తునే.. మరో వైపు పలు టీవీ, యూట్యూబ్ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అయితే తాజాగా పలు స్టార్ హీరోలు నో ఇంటర్వ్యూ పాలసీని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. వారెవరంటే...
తిరు.. సార్‌కు నో ఇంటర్వ్యూ పాలసీ..
తాజాగా రిలీజైన ధనుష్ హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'. ఈ సినిమా కోసం ధనుష్ పలు మీడియా ఛానళ్లకు బ్యాక్-టు-బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే, తన లేటెస్ట్ మూవీ 'తిరు, 'సార్' కోసం ధనుష్ ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే ఆడియో లాంచ్‌లతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై ప్రేక్షకులను అలరించాడు.
ఆ సినిమా కోసం రూల్ బ్రేక్..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్..దశాబ్దాలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాడు. కాగా తమిళ సినిమా 'పోకిరి'కి తన లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సినిమా కోసం ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కాగా 'బీస్ట్' సినిమా రిలీజ్ టైంలో మాత్రం ఓ ప్రముఖ ఛానల్‌కు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చి ఈ రూల్‌ను కాస్త బ్రేక్ చేశాడు. కోవిడ్-19 సమయంలో మేకర్స్ ఆడియో లాంచ్‌ను నిర్వహించలేకపోవడమే దీనికి కారణం. కాకపోతే విజయ్ తరచూ తన అభిమానులను సమావేశాల్లో కలుసుకోవడంతో పాటు తన సినిమాల ఆడియో లాంచ్ కార్యక్రమాలకు హాజరవుతుంటాడు.
దశబ్దాలుగా అజిత్..
దళపతి విజయ్ లాగే స్టార్ హీరో అజిత్ కూడా దశాబ్దాలుగా మీడియాకు దూరంగా ఉంటున్నాడు. అనవసరమైన రూమర్స్‌కు తావు ఇవ్వకుడదని భావించే ఈ హీరో మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పలు మార్లు తెలిపారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉండే ఈ హీరో.. సినిమాకు సైన్ చేసినప్పుడే ప్రొమోషన్లలో పాల్గొననంటూ ఒప్పందం కుదుర్చుకుంటారట.
ప్రెస్ కాన్ఫిరెన్స్ అడ్డా.. ఆడియో లాంచ్ ఈవెంట్స్...
ఒక్కప్పుడు హీరోహీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో పాటు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. మరోవైపు సోషల్ మీడియాతో పాట ఇన్‌ఫ్లుయెన్సర్‌ల రాకతో.. మార్కెటింగ్ స్ట్రాటజీలో పలు మార్పులొచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లే ప్రెస్ కాన్ఫరెన్సులకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు కేవలం సమావేశానికే పరిమితమైన ఈవెంట్లు ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారుతోంది. దీంతో సినిమా ఈజీగా ప్రమోటైపోతోంది. బహుశా ఇప్పటి స్టార్స్ ఆడియో లాంచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
మరోవైపు ఈ ఈవెంట్లకు అభిమానుల్లో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇటీవలే జరిగిన వారసుడు, తిరు, సార్ ఆడియో లాంచ్‌లు అందుకు నిదర్శనం. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలకు భారీగా తరలి వచ్చి ఈవెంట్‌ను విజయవంతం చేశారు.