ETV Bharat / entertainment

నవ్వులు పూయిస్తున్న 'ఎఫ్​ 3' ఫన్​ ట్రైలర్​ - ఎఫ్ 3 మూవీ స్టోరీ

F3 movie trailer: వెంకటేశ్, వరణ్​ తేజ్​ కలిసి నటించిన 'ఎఫ్ 3' ఫన్​ ట్రైలర్​ వచ్చేసింది.​ ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. దాన్ని మీరు చూసేయండి...

F3 movie Trailer
ఎఫ్​ 3 మూవీ ట్రైలర్​
author img

By

Published : May 9, 2022, 10:20 AM IST

F3 movie trailer: నవ్వులు పంచేందుకు 'ఎఫ్ 3' ఫన్​ ట్రైలర్​ వచ్చేసింది.​ 2.35 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. "ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ప్రపంచానికి తెలియనిది ఒకది ఉంది. అదే డబ్బు. డబ్బు ఉన్నవాడికి ఫన్​, లేనివాడికి ఫ్రస్టేషన్​" అనే డైలాగ్​తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్విస్తోంది. నత్తి పాత్రలో వరుణ్​, "వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాదీ దగ్గుబాటి ఫ్యామిలీ" అంటూ వెంకీ చేసిన​ కామెడీ బాగుంది.

గతంలో వచ్చి సూపర్ హిట్​గా నిలిచిన 'ఎఫ్2'కి సీక్వెల్​గా ఈ చిత్రం రూపొందింది. మొదటి పార్ట్​లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్టేషన్​ను చూపించగా ఈ సారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్టేషన్​ను 'ఎఫ్ 3' ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్​కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ ఇతర కీలక పాత్రల్లో నటించగా.. పూజాహెగ్డే స్పెషల్​ సాంగ్​లో చిందులేసింది. ఫన్ డైరెక్టర్​ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: తారక్​-ప్రశాంత్​నీల్ సినిమా సెట్స్​పైకి అప్పుడే.. రిలీజ్​ డేట్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.