ETV Bharat / entertainment

బిజినెస్​లో వెంకీకి బిగ్​ షాక్​.. ఫ్యామిలీ రిక్వెస్ట్​తో..! - వెంకటేశ్​ చదువు

టాలీవుడ్​ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్​.. సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?.. ఓ వ్యాపారం బెడిసికొట్టడం వల్లే ఇండస్ట్రీలోకి వచ్చారా? తొలి సినిమా ఆఫర్​ ఎలా వచ్చింది?.. వీటిన్నంటిపై వెంకీ మామ క్లారిటీ ఇచ్చారు. అవి ఆయన మాటల్లోనే..

Etv BharatDid you know, failed spices business landed Venkatesh in movies?
Etv BDid you know, failed spices business landed Venkatesh in movies?harat
author img

By

Published : Mar 5, 2023, 6:33 PM IST

తెలుగులో మీరు ఏ హీరోకైనా అభిమాని అయ్యిండొచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ​ మెచ్చే ఏకైక హీరో మాత్రం విక్టరీ వెంకటేశ్. ఈ మాట చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమారు నలభై ఏళ్లుగా ఆయను ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా వెంకటేశ్​.. తన అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి రానా నాయుడు అనే వెబ్​సిరీస్​లో నటిస్తున్నారు. మార్చి 10 నుంచి ఓటీటీ నెట్​ఫ్లిక్స్​లో ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్​ కూడా సిరీస్​పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా వీరిద్దరూ వెబ్​సిరీస్​ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాను నటుడు ఎలా అయ్యారో ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్​ వివరించారు.

"నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకోలేదు. అసలు యాక్టర్ కూడా​ అవ్వాలనుకోలేదు. నేను అమెరికాలో ఎంబీఏ చదవి భారత్​కు తిరిగి వచ్చాను. ఆ సమయంలో వ్యాపారం చేద్దామని సిద్ధమయ్యాను. అమెరికా దిగ్గజ కంపెనీ మెక్​కార్మిక్​ సహకారంతో మసాల దినుసుల వ్యాపారం చేద్దామనుకున్నాను. అయితే ఆ ఆలోచన వర్కౌట్​ కాలేదు. ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా నాన్న గారు తన సొంత బ్యానర్‌లో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటించమని అడిగారు. అలా 1986లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాన్నగారు నిర్మించిన కలియుగ పాండవులు అనే సినిమాతో తెరంగేట్రం చేశాను" అని వెంకటేశ్​ చెప్పుకొచ్చారు.

ఇటీవలే మరో ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు వెంకీ మామ. "నా వరకు ఇదొక ఇంట్రెస్టింగ్ జర్నీ. డిఫికల్ట్ రోల్స్​ నన్నెప్పుడూ ఆకర్షిస్తాయి. ఈ సిరీస్‌లో నా రోల్​ కూడా అలాంటిదే. నా రోల్​లో నెగటివ్​ షేడ్స్​ కనిపిస్తాయి. కంప్లీట్​గా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి పాత్రను చేయడం సవాల్‌గా అనిపించింది. కానీ ఎంతో తృప్తినిచ్చింది. ఇందులో నేను, రానా తండ్రీ కొడుకులుగా నటించాం. మా పాత్రలకు జీవం పోయడానికి, మరింత సమర్థవంతంగా రక్తి కట్టించడానికి ఒకరికొకరం సలహాలు, సూచనలు తీసుకున్నాం" అని వెంకీ అన్నారు.

సినిమాల విషయానికొస్తే.. వెంకటేశ్​ నటిస్తున్న కొత్త చిత్రం 'సైంధవ్‌'. వెంకీ​ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్​ నిర్మితమవుతున్నది. ఇది ఆయనకు తొలి పాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. పూర్తిగా యాక్షన్‌ ఎంటర్​టైనర్​గా రూపొందనుంది. శైలేష్‌ కొలను దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్​ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్​ త్వరలోనే ప్రారంభంకానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.