ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​కు కాపీ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన యానిమేషన్​ సంస్థ

'ఆదిపురుష్'​​ సినిమా టీజర్ విడుదల మొదలు.. ఆ సినిమాపై ట్రోలింగ్​ వర్షం కురుస్తోంది. వీఎఫ్​ఎక్స్​ బాగోలేదంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్​ చేస్తున్నారు నెటిజన్స్​. అదే కోవలో ఈ సినిమాపై మరో ఆరోపణ కూడా సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

adipurush poster copied
adipurush poster copied
author img

By

Published : Oct 6, 2022, 7:23 PM IST

Updated : Oct 6, 2022, 7:48 PM IST

ప్రభాస్​ రాముడిగా బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్​ తెరకెక్కించిన చిత్రం 'ఆదిపురుష్'​​. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్​తో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ అక్టోబర్​ 2న టీజర్​ విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్​ చేస్తున్నారు నెటిజన్స్​. తాజాగా ఈ చిత్రం పోస్టర్​పై మరో ఆరోపణ వచ్చింది. ప్రభాస్ 'ఆదిపురుష్'​ పోస్టర్‌ను కాపీ కొట్టారని ఓ యానిమేషన్ స్టూడియో ఆరోపించింది. చిత్ర నిర్మాతలు టీ-సిరీస్ అసలు సృష్టికర్త ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది.

రాముడిగా ప్రభాస్​ ఉన్న ఫోటోను ఇన్​స్టాగ్రామ్​లో స్టోరీ పెట్టింది వానర్​ సేన అనే యానిమేషన్​ సంస్థ. 'ఇంది ఎంత సిగ్గుచేటు. ఎంత అవమానకరం, టీ-సిరీస్ ఆర్ట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది ఎవరో ప్రస్తావించాలి' అంటూ అని క్యాప్షన్ పెట్టింది. తాజాగా మరో పోస్ట్ చేసిన యానిమేషన్ సంస్థ.. 'మేము ఒంటిరి వాళ్లం కాదు.. మేము ఒక సేన.. వానర సేన' అంటూ పేర్కొంది. ఓం రౌత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయాలని సినిమా యూనిట్​ యోచిస్తోంది.

అయితే ఈ సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్​పై దర్శకుడు స్పందించారు. అది 3డీ సినిమా అని.. ఎక్కువ మందికి రీచ్​ కావాలనే ఉద్దేశంతో యూట్యూబ్​లో విడుదల చేశామని చెప్పాడు. దీంతో మరో అడుగు ముందుకేసి థియేటర్లలో కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. అక్టోబర్​ 6న థియేటర్లలో 'ఆదిపురుష్'​​ 3డీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

.

ఇవీ చదవండి: నవంబర్​లో సెట్స్ మీదకు 'NBK 108'.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్​!

SSMB 28 క్రేజీ అప్డేట్​.. మహేశ్​ బాబు@ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!

Last Updated : Oct 6, 2022, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.