ETV Bharat / entertainment

హాలీవుడ్​కు పోటీగా.. రాబోతున్న ఇండియన్ సూపర్ హీరోస్! - రాబోయే సూపర్​ హీరో సినిమాలు

Upcoming Indian Super hero movies: హాలీవుడ్​.. 'సూపర్​మ్యాన్'​, 'స్పైడర్​మ్యాన్'​, 'బ్యాట్​మ్యాన్' ఇలా పలు​ సూపర్​హీరోల సినిమాకు కేరాఫ్​ అడ్రస్​. అయితే ప్రస్తుతం భారతీయ సినిమా సైతం ఈ జోనర్‌లో పోటీపడటానికి సిద్ధమవుతోంది. వచ్చే సంవత్సర కాలంలో సుమారు 5 సూపర్‌ హీరో చిత్రాలు విడుదల కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Upcoming Indian Super hero movies
సూపర్​ హీరో సినిమాలు
author img

By

Published : May 2, 2022, 6:42 AM IST

Upcoming Indian Super hero movies: అకస్మాత్తుగా ప్రపంచానికి ఓ ముప్పు వాటిల్లుతుంది. ఓ దుష్టశక్తి సాయంతో రాక్షస మూక వీరవిహారం చేస్తుంది. వీరిని నిలువరించడానికి సాధారణ హీరోలు సరిపోరు. అప్పుడే మన సినిమాల్లో సూపర్‌ హీరో వస్తాడు. ఎవరూ చేయలేని సాహసాలు చేసి కథ సుఖాంతం చేస్తాడు.

మనుషులకు కాల్పనిక కథలంటే ఉన్న మక్కువ ఈ నాటిది కాదు. వివిధ సంస్కృతులకు సంబంధించిన కాల్పనిక పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇలాంటి పాత్రలతో అనుబంధం పెనవేసుకుపోతుంది. అద్భుత శక్తులున్న మన 'హనుమాన్‌'.. హాలీవుడ్‌ 'స్పైడర్‌మ్యాన్‌'.. ఏ సూపర్‌హీరోతో అయినా ప్రేక్షకుల అనుబంధం చాలా ఏళ్ల పాటు ఉంటుంది. అందుకే ఇలాంటి సినిమాలకు వరుస పెట్టి సీక్వెల్స్‌ వచ్చినా ఆదరణకు నోచుకుంటున్నాయి. సూపర్‌హీరో చిత్రాలు తీయడం పరిశ్రమలకూ లాభదాయకమే. ఈ కథలకు హద్దులు, ఎల్లలు ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణం.

సూపర్‌ హీరోల చిత్రాలకు భారీ బడ్జెట్‌ అవసరం. నిర్మాణ విలువలు సరిగా లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అపార ఆర్థిక వనరులున్న హాలీవుడ్‌ నుంచి తొలిసారిగా 1978లో 'సూపర్‌మ్యాన్‌' చిత్రం వచ్చింది. అది విజయవంతం అవడంతో 'స్పైడర్‌మ్యాన్‌', 'యాంట్‌మ్యాన్‌', 'బ్యాట్‌మ్యాన్‌' ఇలా వరసగా సూపర్‌హీరోలు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం భారతీయ సినిమా సైతం ఈ జోనర్‌లో పోటీపడటానికి సిద్ధమవుతోంది. 'మిస్టర్‌ ఇండియా', 'క్రిష్‌', 'రా వన్‌' వంటి చిత్రాలతో మన దర్శకులూ మంచి ప్రయత్నాలు చేశారు. ఇపుడు హాలీవుడ్‌తో పోటీపడేలా భారీ బడ్జెట్లతో ఈ జోనర్‌ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే సంవత్సర కాలంలో సుమారు 5 సూపర్‌ హీరో సినిమాలు విడుదల కానున్నాయి.

దుష్ట శక్తులపై 'బ్రహ్మాస్త్ర'.. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు 'బ్రహ్మాస్త్ర'లో. దానిపేరు అస్త్ర ప్రపంచం. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌని రాయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. మంచికి చెడుకి, ఆశకి నిరాశకి, ప్రేమకి ద్వేషానికి జరిగే పోరాటమే ఈ కథ. దుష్టశక్తులను ఎదుర్కోవడానికి అత్యంత శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం కోసం 3 వేల ఏళ్ల గతంలోకి వెళ్లే సూపర్‌హీరో కథే ఇది. ఈ చిత్రం ద్వారా పురాణ పాత్రలను ప్రస్తుత ప్రపంచంలోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమా 3 భాగాలుగా రానుందని ఇప్పటికే ప్రకటించారు. సిరీస్‌లో మొదటిదైన ‘బ్రహ్మాస్త్ర పార్ట్‌ వన్‌: శివ’ సెప్టెంబరు 9న విడుదల కానుంది.

తొలి సూపర్‌ ఉమన్‌ కత్రినా.. ఎపుడూ సూపర్‌మ్యాన్‌ సినిమాలేనా అంటూ తొలి సూపర్‌ ఉమన్‌గా వస్తోంది కత్రినాకైఫ్‌. టైటిల్‌ 'సూపర్‌సోల్జర్‌' అని సమాచారం. ఇందులో కత్రినా పాత్రే ప్రధానమైనది కావడంతో డేట్లు కుదరక సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. 2022 చివరి త్రైమాసికం నుంచి చిత్రీకరణను ప్రారంభిస్తామని దర్శకుడు అలీ అబ్బాస్‌ జఫర్‌ ధీమాగా చెబుతున్నాడు. ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలను తీసిన ఈ దర్శకుడు కత్రినా కోసం అద్భుతమైన కథ తయారుచేసినట్లు బీ టౌన్‌ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం కత్రినా కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 వేసవిలోనే ‘సూపర్‌ సోల్జర్‌’ పోరాటాలను మనం చూడవచ్చు.

అందరికీ నచ్చే 'క్రిష్‌'.. భారతీయ సినిమా ప్రేక్షకులకు ఈ తరహా చిత్రాల అసలైన రుచి చూపించిన చిత్రం ‘క్రిష్‌’. అంతకు ముందే విడుదలైన ‘కోయీ మిల్‌ గయా’ కు కొనసాగింపుగా వచ్చింది. 2006లో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. క్రిష్‌ పాత్రలో హృత్రిక్‌రోషన్‌ చేసే సాహసాలు అందరికీ సుపరిచితమే. ఈ సిరీస్‌లో ఇపుడు రానున్న తాజా చిత్రం ‘క్రిష్‌ 4’. రాకేష్‌ రోషన్‌ దర్శకుడు. ‘కోయీ మిల్‌ గయా’ లో అలరించిన జాదూ ఈ సినిమాలోనూ కనిపిస్తాడని తెలుస్తోంది. టైం ట్రావెల్‌ నేపథ్యంలో జరిగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటిస్తున్నాడు. కథానాయికగా కియారా అడ్వాణీ నటిస్తుందని ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగులోనూ... తెలుగులో సూపర్‌హీరో సినిమా ఏమైనా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? మన మొదటి సూపర్‌ హీరో సినిమా ఎన్టీఆర్‌ నటించిన 'సూపర్‌మ్యాన్‌'. 1980లో విడుదలైంది. ఈ ప్రయోగాన్ని అందరూ మెచ్చుకున్నా ఆ తర్వాత తెలుగులో నేరుగా ఈ జోనర్‌లో సినిమాలు రాలేదు. ఈ లోటును తీర్చడానికి సిద్ధమయ్యాడు యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. హాలీవుడ్‌ ‘మార్వెల్స్‌’ తరహాలో పలు సూపర్‌ హీరో పాత్రలతో ఒక సినిమాటిక్‌ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరిని ప్రకటించాడు కూడా. వారే 'హను-మాన్‌', 'అధీరా'. భారతీయ ఇతిహాసాల్లోనే అత్యంత శక్తిమంతమైన పాత్ర ఆంజనేయుడు. ఈ పాత్రనే స్ఫూర్తిగా తీసుకుని 'హను - మాన్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. తేజ సజ్జ, అమృత నాయర్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక మరో సూపర్‌ హీరో 'అధీరా'గా ప్రఖ్యాత నిర్మాత డి.వి.వి దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్‌ కనిపించనున్నాడు. ఇవే కాకుండా బాలీవుడ్‌లో సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో ‘రక్షక్‌’, ఆదిత్య ధర్‌ ‘ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నేచురల్​ బ్యూటీ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.