ETV Bharat / entertainment

'ఎవరైనా కథకు గౌరవం ఇవ్వాల్సిందే.. ఊహించని స్టోరీతో నా నెక్స్ట్​ మూవీ'

Anni Manchi Sakunamule 2023 : కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. యంగ్​ హీరో సంతోష్ శోభన్, మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక నాయర్ జంటగా 'అన్నీ మంచి శకునములే' చిత్రాన్ని తెరకెక్కించారు. గురువారం ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు..

Anni Manchi Sakunamule 2023 nandini reddy

author img

By

Published : May 18, 2023, 7:28 AM IST

Anni Manchi Sakunamule 2023 : కుటుంబ కథా చిత్రాలు తీస్తూ టాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు నందిని రెడ్డి. 'అలా మొదలైంది'తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబీ' చిత్రాల తర్వాత ఆమె డైరెక్షన్​ చేసిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. యంగ్​ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను.. ప్రియాంక దత్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల మందుకు రానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. "దర్శకురాలిగా నా దృష్టిలో సక్సెస్ అంటే కథను కోరుకున్నట్లు చెప్పే స్వేచ్ఛ ఉండటమే'' అని చెప్పారు నందిని రెడ్డి. ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారిలా..

'నా సినీ కెరీర్​లో కథకు తగ్గట్లుగా ట్రావెల్​ చేసి తీసిన సినిమా ఇది. ఎలాంటి లెక్కలు లేకుండా కథకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాం. మొదటి నుంచి చివరి సన్నివేశాల వరకు నిజాయితీగా ఉండాలనుకున్నా. సినిమా చివరి 20 నిమిషాలు నా కెరీర్‌లోనే అత్యుత్తమం. రిలీజ్ తర్వాత ప్రేక్షకులు కూడా అదే చెబుతారు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు.. అంతా మన మంచికే అని భావించి ముందుకు సాగుతాం. ఆ అర్థంలో పెట్టిన పేరే 'అన్నీ మంచి శకునములే'. ఇది ఒక కల్పిత కథ. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో విక్టోరియాపురం అనే ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించి, ఆ నేపథ్యంలో చిత్రీకరించాం. విక్టోరియాపురం కాఫీ తోటలకు ప్రసిద్ధి. కబీర్ ఖాన్ అనే తెలుగు వంటవాడి వల్ల.. బ్రిటీష్ రాణి విక్టోరియా అక్కడ కాఫీ తాగేది. అందుకే ఆ ఊరికి విక్టోరియాపురం అని పేరు. కాఫీ ఎస్టేట్ యజమానులైన రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవలు, ప్రేమ కథాంశంతో సినిమా సాగుతుంది.

'ఈ కథలో నాయకానాయికలతో పాటు ఏడు కీలక పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలను సరిగ్గా పరిచయం చేయడం.. వాటిని కథకు కనెక్ట్ చేయడం ఈ సినిమాలో నాకు పెద్ద ఛాలెంజ్. 'హమ్ అప్కే హై కౌన్' సినిమా చూసిన తర్వాత యాభై మందితో పెళ్లి ఆల్బమ్​లా ఉందని.. చిన్న కుక్కపిల్లతో సహా ప్రతి పాత్ర గురించి మాట్లాడుకున్నాం. పాత్రలను తీర్చిదిద్దేందుకు ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు. అందుకు తగ్గట్టుగానే ఈ స్క్రిప్ట్‌ రాసుకున్నాం. రావు రమేష్, నరేష్ మరియు ఇతర నటీనటులు కలిసి చాలా సినిమాలు చేశారు. మరో సినిమా కోసం కలిశారని కాకుండా అన్ని పాత్రలు కుటుంబ సమేతంగా కనిపించాలని కొత్తదనం కోరుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమా కోసం వాసుకి, అంజు తదితరులను తీసుకున్నాం.'

'రాజేంద్రప్రసాద్ లాంటి నటుడే చేతులు ముడుచుకుని నిలబడాలంటే.. ఎందురుగా షావుకారు జానకి లాంటి నటులను తప్ప ఎవరిని ఊహించుకోగలం? అందుకే ఈ కథకు, పాత్రలకు ఏం కావాలో అదే చేశాం. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ పాత్రల్లో ఒదిగిపోయారు. వారి నటన పట్ల నేను గర్విస్తున్నాను. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంత ఎంజాయ్‌ చేస్తారో.. సెకండాఫ్‌లో భావోద్వేగానికి గురవుతారు. నిర్మాతలు స్వప్న, ప్రియాంక, నేనూ అలాగే ఆలోచిస్తాం. ఈ సినిమా పూర్తైన తర్వాత నాగ్ అశ్విన్ చూశారు. కొన్ని మార్పులు సూచించారు. అవన్నీ సినిమాకు చాలా మంచి చేశాయి.'

'కథ రాయడానికి నారు ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది రచయితలతో కలిసి పని చేస్తున్నాను. కానీ ఇంతకుముందు సొంతంగా రాసుకునేదాన్ని. అప్పుడు సమయం పట్టేది. రైటింగ్, ప్రీ ప్రొడక్షన్, చిత్రీకరణ, రిలీజ్.. ఇలా ఒక్కొక్క సినిమాకి రెండేళ్లు పడుతుంది. ఒక్కోసారి సినిమా పూర్తయ్యాక విడుదల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కోవిడ్, పర్మిషన్లు తదితర కారణాలతో ఈ సినిమాకు రెండేళ్లు తీసుకున్నాం. నా మొదటి సినిమా 'ఆలా మొదలైంది' నుంచి మౌత్ టాక్‌తో కలెక్షన్లు పెరిగాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తదుపరి చిత్రం చేస్తున్నాను'.

'ఈ కథ ఇప్పటి వరకు చాలా తక్కువ మంది హీరోలకే చెప్పిన మాట నిజమే. వాళ్ల ఇమేజ్‌కి సరిపోతుందని భావించి ఉండకపోవచ్చు కానీ.. ఈ కథకు ఫైట్స్ జోడించమని ఎవ్వరూ అడగలేదు. మీరు ఎవరనా సరే.. కథకు ఒక గౌరవం ఇవ్వాలి. హీరో కోసం ఇలాంటి కథలు మారిస్తే న్యాయం జరగదు. కథకి తగిన నటులు ఉండాలి, అలాంటి కథలను వారి వద్దకు తీసుకుపోవాలి. అయితే, అగ్రహీరోలతో మీరు సినిమా చేయరా? అన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ కథ డిమాండ్​ చేస్తే కచ్చితంగా చేస్తా. ఇక, నా నెక్స్ట్​ మూవీలో పెళ్లిళ్లు, ఫ్యామిలీలు ఉండవు (నవ్వుతూ). ఎవరూ ఊహించని కథతో మీ ముందుకు రాబోతున్నాను." అని వివరించారు నందిని రెడ్డి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.