ETV Bharat / entertainment

బాక్సాఫీస్‌కు కొత్త జోష్‌ అందించిందెవరు? ఈ ఏడాది అదరగొట్టిన స్టార్​ హీరోలు

author img

By

Published : Dec 28, 2022, 7:00 AM IST

అగ్ర కథానాయకులు బరిలో దిగితే.. బాక్సాఫీసు ముందు కనిపించే ఆ సందడి మరో స్థాయిలో ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వరుస కట్టాలన్నా.. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్‌ కళకళలాడాలన్నా అగ్రతారల చిత్రాలు రంగంలోకి దిగాల్సిందే. కొవిడ్‌ పరిస్థితుల వల్ల గత రెండేళ్ల కాలంలో అగ్రకథానాయకుల సందడి అంతగా కనిపించలేదు. కానీ, ఈ ఏడాది వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. టాప్‌ స్టార్లంతా జోరు చూపించారు. ఒకరిద్దరు మినహా మిగతా అగ్ర హీరోలంతా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. మరి వారిలో హిట్టు మాట వినిపించి బాక్సాఫీస్‌కు కొత్త జోష్‌ అందించిందెవరు? అంచనాలు పెంచి.. ఉసూరుమనిపించిందెవరు?

tollywood heroes hit movies in 2022
మహేశ్​ బాబు

ఈ ఏడాది బాలకృష్ణ, అల్లు అర్జున్‌ లాంటి ఒకరిద్దరు స్టార్లు మినహా మిగతా అగ్ర కథానాయకులంతా వరుస సినిమాలతో సందడి చేశారు. ఈ సంవత్సరం ఆరంభంలో కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి భయపెట్టినా.. 'బంగార్రాజు'గా సంక్రాంతి బరిలో నిలిచి ప్రేక్షకులకు వినోదాలు పంచిచ్చారు నాగార్జున. ఆయన.. తన తనయుడు నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లతో సత్తా చాటింది. అయితే ఆ తర్వాత నాగ్‌ నుంచి వచ్చిన హిందీ చిత్రం 'బ్రహ్మాస్త్రం'కు మిశ్రమ ఫలితం దక్కగా.. 'ది ఘోస్ట్‌' పూర్తిగా నిరాశ పరిచింది. నాగార్జున ప్రస్తుతం ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే మోహన్‌రాజా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

ఫిబ్రవరిలో 'ఖిలాడీ'గా సందడి చేసిన రవితేజ.. జులైలో 'రామారావు ఆన్‌ డ్యూటీ'తో, డిసెంబరులో 'ధమాకా'తో ప్రేక్షకుల్ని పలకరించారు. అయితే వీటిలో తొలి రెండు సినిమాలకు చేదు ఫలితాలే దక్కాయి. 'ధమాకా' మాత్రం ప్రస్తుతం మంచి వసూళ్లు దక్కించుకుంటూ జోరు చూపిస్తోంది. రవితేజ వచ్చే ఏడాది 'రావణాసుర', 'టైగర్‌ నాగేశ్వరరావు' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే 'భీమ్లానాయక్‌'గా బాక్సాఫీస్‌ బరిలో నిలిచి.. మెరుపులు మెరిపించారు కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. సాగర్‌ కె.చంద్ర తెరకెక్కించగా.. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. పవన్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' చేస్తున్నారు. అలాగే ఇటీవలే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌'ను పట్టాలెక్కించారు.

tollywood heroes hit movies in 2022
ఎన్టీఆర్​, రామ్​ చరణ్​

మార్చి ఆరంభంలో 'రాధేశ్యామ్‌'తో పాన్‌ ఇండియా ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు ప్రభాస్‌. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా.. సినీప్రియుల్ని పూర్తిగా నిరాశపరిచింది. అయినా ప్రస్తుతం ప్రభాస్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడాయన 'ఆదిపురుష్‌', 'ప్రాజెక్ట్‌ కె', 'సలార్‌' లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. ఆయన ఏప్రిల్‌లో తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి 'ఆచార్య'గా సందడి చేయగా.. ప్రేక్షకుల నుంచి చేదు ఫలితం దక్కింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'గాడ్‌ఫాదర్‌' చిరుకు ఊరటనిచ్చే విజయాన్ని అందించింది. ఈ జోష్‌లోనే ఇప్పుడాయన 'వాల్తేరు వీరయ్య'గా సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మేలో 'సర్కారు వారి పాట'తో సినీప్రియుల్ని పలకరించారు మహేష్‌బాబు. పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. వాణిజ్యపరంగా చక్కటి విజయాన్నే అందుకుంది. ఇక ఇదే నెలలో విడుదలైన 'శేఖర్‌'తో రాజశేఖర్‌ మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకోగా.. 'ఎఫ్‌3' చిత్రంతో వెంకటేష్‌ విజయాన్ని అందుకున్నారు. 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా..రూ.120కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. అలాగే వెంకీ అతిథి పాత్రలో మెరిసిన 'ఓరి దేవుడా'కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.

tollywood heroes hit movies in 2022
వెంకటేశ్​, నాగర్జున

మార్చిలోనే వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్లుగా మారిపోయారు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌. ఈ ఇద్దరూ కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో రూపొందింది. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా రూ.1200కోట్ల పైచిలుకు వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. తారక్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. చరణ్‌, శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

tollywood heroes hit movies in 2022
రాజశేఖర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.