ETV Bharat / entertainment

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన విజయ్.. ఆకట్టుకుంటున్న 'వారసుడు' సాంగ్ ప్రోమో! - విజయ్​ దళపతి వరిసు

దళపతి విజయ్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా 'వరిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ప్రోమో విడుదలైంది.

Thalapathy Vijay Varisu First Single
Thalapathy Vijay Varisu First Single
author img

By

Published : Nov 3, 2022, 8:01 PM IST

Thalapathy Vijay Varisu First Single: తమిళ టాప్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న తాజా సినిమా 'వరిసు'. ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు'గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళపతి ఫ్యాన్స్​కు సినిమా యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. గురువారం 'వరిసు' సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.

'రంజితమే.. రంజితమే..' అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. పాటకు తగ్గట్లుగానే విజయ్ మాస్ స్టెప్పులతో దుమ్ములేపారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. తమన్ సంగీతం, విజయ్ డ్యాన్స్​కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాంగ్ ప్రోమో విడుదల కావడంతో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.