ETV Bharat / entertainment

ఇన్​స్టాలోకి అడుగుపెట్టిన 'లియో' స్టార్​.. సంబరాల్లో ఫ్యాన్స్​..! - తలపతి విజయ్ ​​ఇన్​స్టాగ్రామ్

తమిళ స్టార్​ హీరో విజయ్​ తాజాగా ఇన్​స్టా అకౌంట్​ను క్రియేట్​ చేసుకున్నాడు. తన హ్యాండిల్​ వేదికగా అభిమానులను పలకరించాడు. దీంతో తలపతి ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వివరాలు..

Tamil Hero Thalapathi Vijay New Instagram

author img

By

Published : Apr 2, 2023, 4:48 PM IST

Updated : Apr 2, 2023, 6:07 PM IST

తమిళ నటుడు దళపతి విజయ్​ తాజాగా ఇన్​స్టా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆదివారం ఈ సోషల్​ మీడియా వేదికగా తన అభిమానులను పలకరించాడు. ఈ క్రమంలో ఓ పోస్ట్​ పెట్టిన విజయ్ హలో నన్బాస్​ అండ్​ అండ్​ నన్బీస్​ అంటూ క్యాఫ్షన్​ను జత చేశాడు. ఈ పోస్ట్​ చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన అకౌంట్​కు లక్షకు పైగా ఫాలోవర్లు యాడ్​ అయ్యారు. ట్విట్టర్​లోనూ ఆయన అభిమానులు ఈ విషయాన్ని ట్రెండింగ్​ చేస్తున్నారు. కాగా జాయిన్​ అయిన కొద్ది గంటల్లోనే వన్​ మిలియన్​ ఫాలోవర్లను సొంతం చేసుకుని రికార్డుకెక్కాడు.

Tamil Hero Thalapathi Vijay New Instagram
విజయ్​ ఇన్​స్టా అకౌంట్​

ఇటీవలే 'వారసుడు' సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తున్న ఈ స్టార్​ హీరో ప్రస్తుతం లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లియో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్​ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్​ టీజర్​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులోని ప్రతీ సీన్​ ఎంతో ఉత్కంఠ రేపుతోందంటూ అభిమానులు నెట్టింట తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజౌతుందా అంటూ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్​ను కశ్మీర్​లో ప్లాన్​ చేసిన మేకర్స్ ఎముకలు కొరికే చలిలోనూ భారీ షెడ్యూల్​ని విజయవంతంగా కంప్లీట్ చేశారు.56 రోజుల సుదీర్ఘ షెడ్యూల్​ ఇటీవలే పూర్తి చేశారు. ఈ క్రమంలో కశ్మీర్​ షెడ్యూల్​లో తమ సిబ్బంది శ్రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను సైతం మేకర్స్​ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ షెడ్యుల్​తో సినిమాలోని చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిందని సమాచారం. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇంకా రెండు నెలలు మాత్రమే షెడ్యూల్​ ఉందట. దాన్ని కూడా అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని డైరెక్టర్​ ప్లాన్​ చేశారట. అలా తమ నెక్స్ట్​ షెడ్యూల్​ను చెన్నైతో పాటు హైదరాబాద్​లో జరపననున్నారట. సినిమాను త్వరలో కంప్లీట్​ చేసి అభిమానుల ముందుకు తీసుకుని రావాలని ప్లాన్​ చేస్తున్నారట.

మరోవైపు 'లియో' సినిమాలో విజయ్​తో పాటు త్రిష, అర్జున్​, సంజయ్​ దత్త్, ప్రియా ఆనంద్​, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మైస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాంటి స్టార్స్​ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్​ రవిచందర్​ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక దళపతి విజయ్​ లోకేశ్​ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. అప్పట్లో వీరిద్దరు 'మాస్టర్​' సినిమా కోసం కలిసి పని చేశారు. ​ఈ ఏడాది అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Last Updated : Apr 2, 2023, 6:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.