ETV Bharat / entertainment

తరుణ్​ భాస్కర్​ కొత్త సినిమా టైటిల్.. లారెన్స్ 'రుద్రుడు' ఫస్ట్​లుక్.. హిందీ 'హిట్'​ ట్రైలర్​.. ​ - undefined

ఎట్టకేలకు 'పెళ్లి చూపులు' ఫేమ్​ తరుణ్ భాస్కర్ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. హిందీ 'హిట్' మూవీ​​ ట్రైలర్​, లారెన్స్ 'రుద్రుడు' సినిమా ఫస్ట్​ లుక్​ అప్డేట్స్​ మీకోసం.. ​

tarun-bhaskar-new-movie-lawrence-rudrudu-first-look-hindi-remake-trailer-updates
తరుణ్​ భాస్కర్​ కొత్త సినిమా టైటిల్.. లారెన్స్ 'రుద్రుడు' ఫస్టులుక్.. హిందీ రీమేక్​ ట్రైలర్​.. ​
author img

By

Published : Jun 23, 2022, 7:33 PM IST

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించబోయే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్​ వచ్చేసింది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత తరుణ్​.. తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అయితే తాజా సినిమా టైటిల్​ను ప్రకటించి.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. సినిమా పేరును.. 'కీడా కోలా' అని ప్రకటించారు. కామెడీ క్రైమ్​ థ్రిల్లర్​గా ఈ సినిమా ఉండనుంది.

.
.

2016లో వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా మారిన తరుణ్ భాస్కర్ మొదటి ప్రయత్నంలోనే మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' మూవీ తీసి.. మరో హిట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు తరుణ్. ఆ తర్వాత ఓ సినిమాలో హీరోగా.. కొన్ని సినిమాల్లో గెస్ట్​ రోల్స్​ పోషించాడు. అయితే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత.. తరుణ్​ తను దర్శకత్వం వహించే తదుపరి సినిమాను ప్రకటించలేదు. చాలా కాలంగా ఈ అప్డేట్​ కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా పేరును ప్రకటించడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హిందీ 'హిట్'​​ ట్రైలర్​.. ​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్​ హీరో రాజ్‌ కుమార్‌రావు పోలీస్‌ ఆఫీసర్‌గా తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌. 2020లో విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో నటించిన తెలుగు 'హిట్‌'కు రీమేక్‌గా ఈ మూవీని హిందీలో తెరకెక్కించారు. హిందీ రీమేక్​లో సాన్య మల్హోత్ర కథానాయిక. శైలేష్‌ కొలను దర్శకుడు. ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. తాజాగా ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. మాతృక మాదిరిగానే కథ, కథానాలను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. రాజ్‌కుమార్‌రావు నటన, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇదిలా ఉంటే.. శైలేష్‌ కొలను దర్శకత్వంలో అడవి శేష్‌ హీరోగా ‘హిట్‌-2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇది కూడా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

లారెన్స్ 'రుద్రుడు' ఫస్ట్​ లుక్..

.
.

లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రుద్రుడు' నుంచి ఫస్ట్​ లుక్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. 'దెయ్యాలు పుట్టవు .. సృష్టించబడతాయి' అనే బేస్ లైన్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. జాతరలో విలన్ గ్యాంగ్ భరతం పడుతున్న లారెన్స్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి.. కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో.. శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

ఇదీ చదవండి: త్వరలో నటనకు హాలీవుడ్​ హీరో బ్రాడ్ పిట్ దూరం.. మాలీవుడ్​లోకి మైత్రీ మూవీ మేకర్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.