ETV Bharat / entertainment

ముంబయ్ భాయ్​గా తలైవా.. రజనీ న్యూలుక్​ అదుర్స్​! - ​ లాల్​ సలామ్​ మూవీ రజనీకాంత్ పోస్టర్​

రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్​ మూవీ 'లాల్ సలామ్' నుంచి ఓ క్రేజీ అప్డేట్​ను ఇచ్చింది మూవీ టీమ్​. ఈ సినిమాలో రజనీ ఫస్ట్ లుక్​ను విడుదల చేశారు. ఆ అప్డేట్స్​ మీ కోసం..

Rajinikanth
Rajinikanth lal salaam
author img

By

Published : May 8, 2023, 10:33 AM IST

Updated : May 8, 2023, 11:05 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లాల్​ సలామ్​'. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్​ నిర్మిస్తుంది. 'జైలర్'​ సినిమా తర్వాత రజనీ నటిస్తున్న మూవీ అయినందున అభిమానుల్లో దీనిపై ఆసక్తి ఎక్కువైంది. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్​ను అనౌన్స్​ చేసింది మూవీ టీమ్.

ఈ మూవీలోని రజనీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. "అందరికి ఇష్టమైన భాయ్​ ముంబయికి తిరిగి వచ్చేశారు. మొయిదిన్​ భాయ్​గా రజనీ వచ్చేస్తున్నారు". అంటూ ఆ పోస్టర్​ను షేర్​ చేశారు. అందులో రజినీకాంత్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయన్ను ఇలా సరికొత్త అవతారంలో చూసిన ఫ్యాన్స్​ ఈ పోస్టర్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. క్రికెట్​ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో రజనీతో పాటు యువ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్​ స్టార్​ జీవిత రాజశేఖర్‌ కూడా కీలక పాత్ర చేస్తున్నారట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం రజనీ ముంబయిలో ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఈ ఏడాదికల్లా థియేటర్లలో రిలీజ్​ చేసేందుకు మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాతో పాటు రజినీ మరో సినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ తెరకెక్కిస్తున్న 'జైలర్‌' అనే సినిమాలో లీడ్ రోల్​లో నటిస్తున్నారు. ఇందులో రజనీతో పాటు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్‌ కుమార్, సునీల్, తమన్నా, రమ్యకృష్ణ, మీర్నా మీనన్‌ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్ట్​ 10న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజయ్యేందుకు రెడీగా ఉంది. కాగా 'జైలర్‌'మూవీ నుంచి కూడా ఆదివారం ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీమ్​. అందులో స్టైల్‌గా కారులో కూర్చున్న రజనీ కసిపిస్తారు. ఇందులో ఆయన మాస్‌ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అలాగే 'జై భీమ్‌' ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్​ చేశారు రజనీ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలు కానుంది.

Last Updated : May 8, 2023, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.