ETV Bharat / entertainment

సుధీర్​ బాబు కొత్త లుక్​.. సిక్స్​ ప్యాక్​ నుంచి లడ్డు బాబులా.. - సుధీర్ బాబు లడ్డు బాబు లుక్​

హీరో సుధీర్ బాబు తన కొత్త సినిమా కోసం ఓ ప్రయోగం చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఎప్పుడూ సిక్స్​ ప్యాక్​లో కనిపించే ఆయన ఈ సారి లడ్డుబాబుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసేయండి..

Sudheer babu new look
సుధీర్​ బాబు కొత్త లుక్​.. సిక్స్​ ప్యాక్​ నుంచి లడ్డు బాబులా..
author img

By

Published : Feb 27, 2023, 5:45 PM IST

హీరో, హీరోయిన్స్​.. లుక్​, స్టైల్​తో పాటు ఫిట్​ నెస్​పై దృష్టి పెడతారన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ పాత్రకు తగ్గట్టూ తమ లుక్స్​ను మారుస్తుంటారు. కథ డిమాండ్ చేయాలే గానీ అవసరమైతే స్లిమ్​గా, లేదంటే బరువు పెరిగి చబ్బీగా మారుతుంటారు. మరీ అవసరం అనుకుంటే కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చిత్రాల కోసం విపరీతంగా బరువు కూడా పెరిగిపోతుంటారు.

అలా ఇప్పటికే 'సైజ్ జీరో' మూవీ కోసం హీరోయిన్​ అనుష్క, ​ లడ్డుబాబు సినిమా కోసం అల్లరి నరేశ్ మేకోవర్​​​.. ఊబకాయం ఉన్న వ్యక్తుల్లా కనిపించిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు నటులు కూడా ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఇటువంటి ఎక్స్​పెరిమెంట్ చిత్రాలు హిట్​ ఫ్లాప్​ అన్న విషయాలను పక్కనపెడితే.. అలాంటి మూవీస్​ కోసం వారు చాలా కష్టపడతారు. అయితే తాజాగా మరో హీరో సుధీర్ బాబు కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నారు.

రీసెంట్​గా​ హంట్ సినిమాతో డిజాస్టర్​ను అందుకున్న సుధీర్ బాబు.. ప్రస్తుతం 'మామ మశ్చీంద్ర' అనే సినిమాలో నటిస్తున్నారు. ఫిట్​నెస్​కు ప్రాధాన్యమిస్తూ.. ఎప్పుడూ సిక్స్​ ప్యాక్​లో కనిపించే ఈయన​.. ఈ కొత్త సినిమా కోసం లడ్డుబాబులో నరేశ్​లా తయారయ్యారు. ఊబకాయం ఉన్న వ్యక్తిలా కనిపించనున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చెక్​లో భాగంగా క్లిప్​ను చెక్​ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో సుధీర్ బాబు మొఖం బాగా ఉబ్బినట్టు.. ఊబకాయం వచ్చిన వ్యక్తిలా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమాలో పూర్తిస్థాయి ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారా? లేదా కాసేపటికేనా అనేది క్లారిటీ లేదు. కానీ గతంలో విడుదలైన ఈ సినిమా పోస్టర్​లో ఆయన స్లిమ్​గానే కనిపించారు. ఆయన ఈ చిత్రంలో రాక్​ స్టార్ పాత్ర పోషిస్తున్నట్లు గతంలో మూవీ టీమ్​ తెలిపింది.

ఇంకా ఈ సినిమా విషయానికొస్తే.. దీనికి హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. పి.జి. విందా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'నాటు నాటు'కు ఆలియా ఇరగదీసిందిగా.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.