ETV Bharat / entertainment

'హిట్-2' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా జక్కన్న.. సెంటిమెంట్​ వర్కౌట్​ అవుతుందా? - హిట్2 సినిమా దర్శకుడు

అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హిట్ -2'. డిసెంబ‌ర్ 2న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్​ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. గెస్ట్​గా అగ్ర దర్శకుడు రాజమౌళి హాజరుకానున్నారు.

hit2
హిట్ 2
author img

By

Published : Nov 27, 2022, 1:00 PM IST

Hit2 Pre Release Event Rajamouli: అడివి శేష్ కథానాయకుడిగా న‌టిస్తున్న 'హిట్ -2' సినిమా డిసెంబ‌ర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సైక‌లాజిక‌ల్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను న‌వంబ‌ర్ 28న‌ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా దర్శకధీరుడు రాజ‌మౌళి హాజ‌రుకానున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. 'హిట్ 2' సినిమాను వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతితో క‌లిసి హీరో నాని నిర్మిస్తున్నారు. 2020లో విశ్వ‌క్‌సేన్ హీరోగా 'హిట్' ఫ‌స్ట్ కేస్ సినిమాకు సీక్వెల్‌గా 'హిట్-2' తెర‌కెక్కుతోంది. 'హిట్' ఫ‌స్ట్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి గెస్ట్‌గా వ‌చ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. మ‌రోసారి ఆ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజ‌మౌళిని గెస్ట్‌గా ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం.

hit 2
హిట్ 2

రాజ‌మౌళితో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ కార్యక్రమానికి హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలిసింది. 'హిట్-2' సినిమాలో కృష్ణ‌దేవ్ అలియాస్ కేడీ అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ క‌నిపించ‌బోతున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.