ETV Bharat / entertainment

'ప్రభాస్​ సెట్స్​లో అలా ఉండేవారు - ఆ మాట నేను అస్సలు ఊహించలేదు' - శ్రుతి హాసన్​ గురించి రాజమౌళి కామెంట్స్

Shruti Haasan Salaar Movie : 'సలార్​' మూవీలో ఆద్య అనే క్యారెక్టర్​లో నటించి ప్రేక్షకులను మెప్పించింది కోలీవుడ్​ బ్యూటీ శ్రుతి హాసన్​. తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 5:02 PM IST

Shruti Haasan Salaar Movie : ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ మూవీ ఎటువంటి బ్లాక్ బస్టర్​ టాక్ అందుకుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు మువీ లవర్స్​ నుంచి ఈ సినిమాకు విశేషాదరణ లభించడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. స్టోరీ పరంగానే కాకుండా ఇందులో ఇతర నటీనటులపై కూడా నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. సెలబ్రిటీల నుంచి ఆడియెన్స్​ వరకూ అందరూ ఈ సినిమాలోని పాత్రలను పొగడ్తలతో ముంచేవారే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్​కు ఓ స్టార్ డైరెక్టర్​ కాంప్లీమెంట్ ఇచ్చారట. ఆ విషయానన్ని ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యోలూ చెప్పుకొచ్చింది.

"ప్రభాస్‌ అందరితో ఎంతో స్నేహంగా ఉంటారు. ఆఫ్‌ స్క్రీన్‌లో ఎంత సరదాగా ఉంటారో కెమెరా ముందు పూర్తి భిన్నంగా మారిపోతారు. సెట్‌లో అందరితో కలిసిపోతారు. నేను ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినప్పుడు దీనికి కచ్చితంగా మంచి ఆదరణ లభిస్తుందని అనుకున్నాను. ప్రశాంత్‌ నీల్‌ ప్రపంచంలో నేనూ భాగమైనందుకు సంతోషించాను. 'సలార్‌' ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి సర్​ నన్ను పొగడటాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా డ్యాన్స్‌ ఆయనకు నచ్చిందంటూ చెప్పడమే నాకు ఓ పెద్ద ప్రశంస. ఈ ఏడాది నాకెంతో స్పెషల్​. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోల సినిమాలతో ప్రారంభమైన ఈ సంవత్సరం ప్రభాస్‌ చిత్రంతో ముగిసింది. వీటితో పాటు నేను పాడిన ఆల్బమ్‌కు మ్యూజిక్ లవర్స్​లో మంచి ఆదరణ లభించింది" అంటూ శ్రుతి హాసన్‌ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Shruti Haasan Upcoming Movies : మరోవైపు శ్రుతి తన అప్‌కమింగ్‌ చిత్రాల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడింది. 'ది ఐ' అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో నేను నటిస్తున్నాను. దీంతో పాటు అడివి శేష్‌తో 'డకాయిట్‌' అనే చిత్రం కోసం పని చేస్తున్నాను. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టైటిల్‌ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రానున్న ఏడాదిలో ఇలాంటి రెండు విభిన్న చిత్రాలతో అభిమానులను పలకరించనున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది" అని శ్రుతి చెప్పుకొచ్చింది.

Shruti Haasan Chit Chat : 'ఇన్​స్టాలోనే శంతన్​తో లవ్.. పెళ్లంటే బోరింగ్!'​.. శ్రుతికి 'అలా' చేయాలనుందట!!

శత్రువులుగా మారిన ప్రేమికులు- అడివి శేష్ 'డెకాయిట్' టీజర్​ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.