ETV Bharat / entertainment

శంకర్- రణ్​వీర్​ భారీ స్కెచ్.. బాహుబలిని మించిన బడ్జెట్​తో మూవీ! - రణ్​వీర్ సింగ్ సినిమాలు

Ranveer Singh Shankar Movie : దర్శకుడు శంకర్.. బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​తో ఓ భారీ బడ్జెట్​ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమా ప్రముఖ తమిళ ఇతిహాస నవల వేల్పరి ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

shankar ranveer singh combo movie
శంకర్ రణవీర్ సింగ్ కాంబోలో మూవీ
author img

By

Published : Nov 7, 2022, 10:19 PM IST

Updated : Nov 7, 2022, 10:52 PM IST

Ranveer Singh Shankar Movie : తమిళ అగ్ర దర్శకుడు శంకర్.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్​ సింగ్​తో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బాహుబలిని మించి ఉంటుందని టాక్​. అంతకుముందు 'అపరిచితుడు' సీక్వెల్​ను శంకర్​.. రణ్​వీర్​తో తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఆగిపోయినట్లు సమాచారం.

తమిళ ప్రముఖ ఇతిహాస నవల 'వేల్పరి' ఆధారంగా మూడు భాగాలుగా రణ్​వీర్​తో శంకర్ సినిమా తెరకెక్కించనున్నారు. 2023 వేసవిలో మొదటి భాగం షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్​, హీరో రణ్​వీర్ కెరియర్లలో ఇదే భారీ బడ్జెట్ చిత్రం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం శంకర్ కమల్​హాసన్​తో 'భారతీయుడు 2', హీరో రామ్​చరణ్​తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు 'జయేశ్‌భాయ్‌ జోర్దార్‌' సినిమాతో మేలో ప్రేక్షకుల ముందుకొచ్చారు రణ్‌వీర్‌. ప్రస్తుతం 'సర్కస్‌', 'రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ' సినిమాల్లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి: రాధికతో అట్లుంటది మరి అందాన్ని అస్సలు దాచదుగా

మయోసైటిస్‌ ప్రకటన తర్వాత ఫొటోతో సమంత అప్‌డేట్‌

Last Updated : Nov 7, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.