ETV Bharat / entertainment

షారుక్‌ కోసం ఆ పాత్రలో దీపిక.. బాధలో రణ్​బీర్ కపూర్​​! - shamshera ranbir kapoor

బాలీవుడ్​ హిట్​ పెయిర్​ షారుక్​ ఖాన్, దీపికా పదుకొణె త్వరలోనే మరోసారి కలిసి నటించనున్నట్లు సమాచారం. షారుక్​ చిత్రంలో దీపిక ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుందని తెలుస్తోంది. ఇక తన 'షంషేరా' చిత్రం విడుదల సందర్భంగా తండ్రి రిషి కపూర్​ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​.

shah rukh khan deepika padukone
Ranbir Kapoor
author img

By

Published : Jun 24, 2022, 7:44 AM IST

దీపికా పదుకొణె, షారుక్‌ఖాన్‌లది హిట్‌ కాంబినేషన్‌. ప్రస్తుతం ఈ కలయికలో 'పఠాన్‌' చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి షారుక్‌ చిత్రంలో దీపిక ఆడిపాడనుందని సమాచారం. అట్లీ దర్శకత్వంలో షారుక్‌ నటిస్తున్న చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇందులో అతిథి పాత్రలో దీపిక సందడి చేయనుందట. ఆమె సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని, ఒప్పందం జరగాల్సి ఉందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది.

shah rukh khan deepika padukone
దీపిక

రణ్​బీర్​ భావోద్వేగం: త్వరలోనే 'షంషేరా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ స్టార్ రణ్​బీర్​కపూర్. జులై 22న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ క్రమంలోనే తన తండ్రి రిషి కపూర్​ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు రణ్​బీర్​. ఈ సినిమా చూడటానికి ఆయన బతికి ఉండి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడనని అన్నారు.

Ranbir Kapoor
'షంషేరా'

"'షంషేరా' చూసేందుకు మా నాన్న బతికి ఉంటే బాగుండు. నా పని నచ్చినా, నచ్చకపోయినా చాలా నిజాయతీగా చెప్పేవారు. ఈ సినిమా ఆయన చూడలేకపోవడం చాలా బాధగా ఉంది. కానీ, ఇలాంటి చిత్రం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్నా ఆయన నా పట్ల గర్వంగా ఉంటారనే భావిస్తున్నా." అని రణ్​బీర్​ తెలిపారు.

ఇదీ చూడండి: పూరిజగన్నాథ్​పై బండ్లగణేశ్ షాకింగ్​​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.