ETV Bharat / entertainment

13 ఏళ్ల తర్వాత ఆ రోల్​లో సామ్​.. మళ్లీ హిట్ కొడతారా? - Samantha Kushi Movie

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, హీరోయిన్​ సమంత జంటగా రానున్న సినిమా 'ఖుషి'. ఏప్రిల్​ 28న సమంత బర్త్​డే కానుకగా ఓ స్టిల్​ను విడుదల చేశారు మూవీ మేకర్స్​. మరి ఈ మూవీలో సామ్ ఏ పాత్రలో మెరవనున్నారో తెలుసా?

Mythri Movie Makers Samantha Birthday Special
13 ఏళ్ల తర్వాత ఐటీ ఎంప్లాయ్​ రోల్​లో సమంత
author img

By

Published : Apr 28, 2023, 5:25 PM IST

స్టార్ హీరోయిన్​ సమంత, రౌడీ బాయ్​ విజయ్​ దేవరకొండ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఖుషి'. అయితే ఈ సినిమాలో సామ్​ ఓ ఐటీ ఉద్యోగి రోల్​లో కనిపించనున్నారట. దాదాపు 13 ఏళ్ల క్రితం విడుదలైన 'ఏ మాయ చేసావె' మూవీలో ఈ పాత్రలో మెరిశారు. 2010లో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్యకు జంటగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు సమంత. అంతేగాక సినిమా కూడా మంచి టాక్​ను సంపాదించుకుంది. దీంతో ఈ మూవీలో సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ రోల్​లో మెప్పించిన సామ్​ ఇప్పుడు ఖుషిలోనూ ఎప్పుడెప్పుడు అలరిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి​గా వెయిట్​ చేస్తున్నారు.

సామ్​ బర్త్​డే కానుకగా..
ఏప్రిల్​ 28 సమంత పుట్టినరోజు సందర్భంగా 'ఖుషి' చిత్రం నుంచి ఓ స్టిల్​ను రిలీజ్​ చేసింది మూవీ యూనిట్​. ఈ స్టిల్​లో సామ్​ ఓ ఐటీ ఉద్యోగి క్యారెక్టర్​లో నటిస్తున్నారన్న విషయం తెలుస్తోంది. ఈ ఫొటోను చూసిన కొందరు ఫ్యాన్స్​ తెలుగులో సమంత నటించిన 'ఏ మాయ చేసావె' సినిమాలో కనిపించిన సామ్​ గుర్తుకు వస్తోంది అంటూ కామెంట్స్​ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో కూడా సమంత సాప్ట్​వేర్​ ఎంప్లాయ్​ రోల్​లో నటించారు. తాజాగా విడుదలైన సామ్​ స్టిల్​ గమనిస్తే 'ఏ మాయ చేసావె'లో నడిచినట్టే ఉంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్​లోని దుర్గం చెరువు దగ్గర్లోని పలు ఐటీ కంపెనీల్లో విజయ్​ దేవరకొంద, సమంతల మధ్య కొన్ని సీన్స్​ను షూట్​ చేశారు. ఇవ్వని చూస్తుంటే 'ఏ మాయ చేసావె' తర్వాత ఓ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి కనిపించడం బహుశా 'ఖుషి'లోనే కావచ్చు.

ఖుషి సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తుండగా.. పీటర్ హెయిన్ ఫైట్స్​ మాస్టర్​గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ యాక్టర్​ సచిన్ ఖేడేకర్​ తదితరులు నటిస్తున్నారు. సెప్టెంబర్​ 1న ప్రపంచ వ్యాప్తంగా పాన్​ ఇండియా రేంజ్​లో ఖుషిను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది తెలుగు సహా కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో రిలీజ్​ కానుంది. మైత్రి మూవీ మేకర్స్​ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను 'మజిలీ' మూవీ హిట్​ డైరెక్టర్​ శివ నర్వాణ డైరెక్ట్​ చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద హిట్​గా నిలిచింది. ఇక ఖుషి సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'లైగర్' సినిమాలతో విజయ్ దేవరకొండ అటు నార్త్​తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్​ను సంపాదించుకున్నారు. మరోవైపు 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సమంత పరిచయమై నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేగాక 'యశోద' పాన్ ఇండియా సక్సెస్​ను సాధించింది. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్​లో వస్తున్న సినిమా కావడం వల్ల అంతటా ఈ సినిమాకు మంచి హైప్​ క్రియేట్​ అయింది.

లండన్​లో 'సిటాడెల్' సందడి!
ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందుతున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్​లో భాగంగా ప్రస్తుతం లండన్​లో ఉన్నారు సమంత. ఈ సిరీస్​లో బాలీవుడ్​ నటుడు వరుణ్​ ధావన్​కు జోడీగా నటిస్తున్నారు సామ్​. బర్త్​డే రోజు కూడా సామ్​ షూటింగ్​లో బిజీగా ఉండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.