ETV Bharat / entertainment

దుల్కర్​కు జోడీగా సమంత.. తెరపైకి మంగళ్​యాన్ విజయగాథ - దుల్కర్​ సల్మాన్​

Telugu cinema updates: 'యశోద', 'ఖుషి' చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న స్టార్​ హీరోయిన్ సమంత.. దుల్కర్​ సల్మాన్​కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు, 2019లో విడుదలై సంచలన విజయం అందుకున్న 'జోకర్​'.. సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీన్ని 2024 అక్టోబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

telugu cinema updates
telugu cinema updates
author img

By

Published : Aug 6, 2022, 8:53 AM IST

Telugu cinema updates: చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన 'శాకుంతలం' నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. 'యశోద', 'ఖుషి' చిత్రాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. మరోవైపు హిందీలో తెరంగేట్రం చేసేందుకు కొన్ని కథలు ఓకే చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పుడామె ఖాతాలో ఓ మలయాళ చిత్రం చేరినట్లు తెలుస్తోంది. అదే 'కింగ్‌ ఆఫ్‌ కోత'. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. అభిలాష్‌ జోషి తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా సామ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌, సమంత గతంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన 'మహానటి' చిత్రంలో నటించారు. కానీ, అందులో ఇద్దరికీ కాంబినేషన్‌ సీన్లు లేవు.

.

'జోకర్​' మళ్లీ వస్తున్నాడు: జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం 'జోకర్‌' బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.07 బిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఫీనిక్స్‌ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా 'జోకర్‌: ఫోలీ ఎ డ్యూక్స్‌' తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన టాడ్‌ ఫిలిప్స్‌ ఈ సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 2024 అక్టోబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. 'జోకర్‌'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సీక్వెల్‌లో హార్లే అనే కీలక పాత్రలో లేడీ గాగా సందడి చేయనుంది.

తెరపైకి మంగళ్​యాన్​ విజయగాథ: అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మంగళ్‌యాన్‌ మిషన్‌. అతి తక్కువ ఖర్చుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఈ మార్స్‌ మిషన్‌.. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా లక్ష్యాన్ని సాధించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇప్పుడీ మంగళ్‌యాన్‌ విజయగాథను 'యానం' పేరుతో తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు వినోద్‌ మంకర. ప్రపంచ సినిమా చరిత్రలో మొట్ట మొదటి సైన్స్‌ - సంస్కృత చిత్రమిది. ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ రచించిన 'మై ఒడిస్సీ: మెమోయిర్స్‌ ఆఫ్‌ ది మ్యాన్‌ బిహైండ్‌ ది మంగళ్‌యాన్‌ మిషన్‌' పుస్తకాధారంగా దీన్ని తెరకెక్కించారు.

ఇది ఆగస్టు 21న చెన్నైలో ప్రదర్శితం కానుంది. ఈ చిత్ర ప్రీమియర్‌ను ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. ''ఇస్రోతో పాటు అందులోని శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను ప్రపంచం ముందు ప్రదర్శించడమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యం. భారతీయ శాస్త్రవేత్తలు అన్ని పరిమితులను అధిగమించి.. సంక్లిష్టమైన మార్స్‌ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే ఎలా సాధించారో ఇది వివరిస్తుంది. 45 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది'' అని దర్శకుడు వినోద్‌ తెలిపారు.

.

సెట్స్‌పైకి 'మహావీరుడు': శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'మహావీరుడు'. అరుణ్‌ విశ్వ నిర్మాత. అదితి శంకర్‌ కథా నాయిక. ఈ సినిమా శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ''ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ఇందులో శివ కార్తికేయన్‌ మాస్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు'' అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: భరత్‌ శంకర్‌, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న.

వెలుగు చూడని నిజాలతో..: ఈశ్వర్‌బాబు.డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '1948 - అఖండ భారత్‌'. గాంధీగా రఘునందన్‌, గాడ్సేగా డా.ఆర్యవర్ధన్‌ రాజ్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌గా శరద్‌ దద్భావల, నెహ్రూగా ఇంతియాజ్‌ నటించిన చిత్రమిది. ఎం.వై.మహర్షి నిర్మాత. భారతీయ భాషల్లోనూ, ఇతర ముఖ్య అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ''96 పాత్రలు, 114 సన్నివేశాలు, 700కిపైగా వస్తువులు, 500కిపైగా జూనియర్‌ ఆర్టిస్టులతో చేసిన సినిమా ఇది. 47 లొకేషన్లలో 9 షెడ్యూళ్లల్లో సినిమా తీశాం'' అన్నారు. డా.ఆర్యవర్ధన్‌ రాజు మాట్లాడుతూ ''డెబ్భై ఏళ్లపాటు వెలుగులోని నిజాల్ని.. ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. మహాత్మాగాంధీ హత్యకి 45రోజుల ముందు మొదలై.. హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. వివాదాలకి తావులేని రీతిలో ఈ సినిమాని రూపొందించాం'' అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకి ధృవీకరించడానికి నిరాకరిస్తే మేం ముంబయి వెళ్లి అక్కడ సెన్సార్‌ చేయించామని నిర్మాత తెలిపారు. తెలుగువాళ్లంతా గర్వపడేలా రూపొందించారని మెచ్చుకున్నారు టి.ప్రసన్నకుమార్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రజ్వల్‌ క్రిష్‌, ఎడిటర్‌ రాజుజాదవ్‌, నటుడు సుహాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: తెలుగు తెరకు 'కొత్తందం'.. గ్రాండ్​ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు

ఇంజనీర్​- రోబోల మధ్య రొమాన్స్​..! క్రేజీ కాన్సెప్ట్​తో బాలీవుడ్​ చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.