ETV Bharat / entertainment

'సామ్​.. ఏం మాయ చేశావో'.. అంటూ స్టార్​ హీరో బర్త్​డే విషెస్​! - సమంతో పోస్టు

Samantha Birthday: స్టార్​ హీరోయిన్​ సమంతకు టాలీవుడ్ హీరో సాయిధరమ్​తేజ్​ కొంచెం కొత్తగా విషెస్ చెప్పారు. సామ్​ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన తెలిపారు. ఆ అభిమానాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలతో చాటుకున్నాడు. మరోవైపు సామ్​.. తన పుట్టినరోజు వేడుకలను కశ్మీర్​లో జరుపుకున్నారు.

samantha birthday
samantha birthday
author img

By

Published : Apr 28, 2022, 3:32 PM IST

Samantha Wishes: అగ్రకథానాయిక సమంతకు నటుడు సాయిధరమ్​తేజ్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సామ్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆయన ఇప్పటికే పలు పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌పై చెప్పారు. ముఖ్యంగా ఆమె వెండితెరకు పరిచయమైన ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి తాను మనసు పారేసుకున్నానని ఎన్నోసార్లు తెలిపారు. కాగా, తాజాగా సాయితేజ్‌ మరోసారి సమంతపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. గురువారం సమంత పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన కాస్త విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

samantha birthday
సాయిధరమ్​తేజ్​​ పోస్ట్​

"జెస్సీ.. నువ్వు ఏ మాయ చేశావో కానీ.. ఏటో వెళ్లిపోయింది మనసు.. హ్యాపీ బర్త్‌డే సమంత.. నిన్ను అమితంగా ఇష్టపడే అభిమాని" అంటూ సామ్‌ నటించిన సినిమా పేర్లు ఉపయోగించి సాయి విషెస్‌ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాయితేజ్‌తోపాటు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు సైతం సమంతకు విషెస్‌ తెలిపారు. ఈ ఏడాది సమంతకు అన్ని విధాలుగా కలిసి రావాలని కోరుకున్నారు. టాలీవుడ్‌ దర్శకురాలు నందినిరెడ్డి, హన్సిక, రష్మిక, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, కీర్తిసురేశ్‌, త్రిష, కంగనా రనౌత్‌, వరుణ్‌ ధావన్‌, వెన్నెల కిషోర్‌, ఉపాసనతోపాటు పలువురు డైరెక్టర్లు, చిత్ర నిర్మాతలు సైతం సామ్‌కు విషెస్‌ తెలిపారు.

కశ్మీర్​లో వేడుకలు.. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సామ్​ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్​ షెడ్యూల్​లో భాగంగా కశ్మీర్​లో ఉన్న సామ్​ అక్కడే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక, చిన్న కుటుంబం నుంచి వచ్చి అంతెత్తుకు ఎదగడం.. ఎదిగిన తర్వాత లేని వారికి సేవ చేయడంలో అందరికీ సమంత స్ఫూర్తి అంటూ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

samantha birthday
సామ్​ పుట్టినరోజు వేడుకలు
samantha birthday
సామ్​ పుట్టినరోజు వేడుకలు

ఇవీ చదవండి: సమంతలో ఈ యాంగిల్​ కూడా ఉందా?

సామ్​ 'ఊ అంటావా మావ' సాంగ్​కు కోహ్లీ చిందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.