ETV Bharat / entertainment

శ్రేయా ఘోషల్‌ గొంతుతో 'కల్లు సీసా'.. పొన్నియిన్‌ సెల్వన్‌ పోస్టర్‌.. 'గార్గి' విడుద‌ల తేదీ ఖరారు - ponniyin selvan movie update

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కించిన 'రామారావు ఆన్‌ డ్యూటీ' 'నా పేరు సీసా' మాస్​ బీట్​ శనివారం విడుదలైంది. మణిరత్నం మూవీ 'పొన్నియిన్‌ సెల్వన్‌-1', సాయి పల్ల సినిమా 'గార్గి' సినిమా అప్డేట్స్​ మీకోసం..

raviteja ramarao on duty, sai pallavi gargi, mani rathnam ponniyin selvan movies updates
శ్రేయా ఘోషల్‌ గొంతులో 'కల్లు సీసా'.. పొన్నియిన్‌ సెల్వన్‌ పోస్టర్‌.. 'గార్గి' విడుద‌ల తేదీ ఖరారు
author img

By

Published : Jul 2, 2022, 9:25 PM IST

ramarao on duty song: 'నా పేరు సీసా.. నా పేరు సీసా.. ఒకరికి నే తేనే సీసా.. ఒకరి నే కల్లు సీసా' అంటూ తనదైన వాయిస్‌తో పాట పాడి అదరగొట్టారు శ్రేయా ఘోషల్‌. రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రం 'రామారావు ఆన్‌ డ్యూటీ'. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. శనివారం ఈ చిత్రంలోని ఐటమ్‌ సాంగ్‌ 'నా పేరు సీసా' లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. శ్యామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. ఇక ఈ ఐటమ్‌ సాంగ్‌కు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించగా, అన్వేషి జైన్‌ స్టెప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 'రామారావు ఆన్‌ డ్యూటీ' జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రవితేజ శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ponniyin selvan motion poster: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. శనివారం ఈ సినిమా మోషన్‌ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా 'చోళులు వస్తున్నారు' అంటూ అందులో రాసుకొచ్చారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనుండగా.. ఫస్ట్‌ పార్ట్‌ సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

gargi movie release date: ఇటీవల 'విరాట‌ప‌ర్వం'లో వెన్నెలగా అలరించిన సాయి పల్లవి.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తను నటించిన 'గార్గి' సినిమా విడదల తేదీని ప్రకటించింది సాయి పల్లవి. జులై 15న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌ుడు. ఈ సినిమాను త‌మిళంలో 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుద‌ల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఇదీ చదవండి: కపిల్ దేవ్, సద్గురుతో రకుల్ ప్రీత్ సింగ్ ఆట మామూలుగా లేదుగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.