ETV Bharat / entertainment

ఫుల్​ ట్రెండింగ్​లో విజయ్​ 'రంజితమే' సాంగ్​.. యూట్యూబ్‌ షేక్​ - వారిసు సినిమా దర్శకులు

స్టార్​ హీరో విజయ్​ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. విజయ్​ ఒక స్టెప్పెస్తే చాలు అభిమానులకు పూనకాలే. అయితే విజయ్​ కొత్త సినిమా 'వారిసు' సాంగ్​ ఇప్పుడు నెట్టింట్లో వైరల్​ అవుతోంది. విజయ్‌ మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది.

ranjithame song varisu
రంజితమే సాంగ్
author img

By

Published : Nov 16, 2022, 12:10 PM IST

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన 'వారిసు' లోని ఫస్ట్‌ సింగిల్‌ నెట్టింట విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 'రంజితమే' అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేసి పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరుగుతోంది.

ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ ఓ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ పాట 5 కోట్ల వ్యూస్‌, 18 లక్షల లైక్స్‌ సొంతం చేసుకుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫ్యామిలీ, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి దర్శకుడు.

ఇదే చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరిట విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాత. రష్మిక కథానాయిక. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి: సూపర్​ స్టార్​ కృష్ణను ఈ డిఫరెంట్​ గెటప్స్​లో చూశారా

సూపర్​ స్టార్​ కృష్ణ గురించి ఈ ఆసక్తికర విషయాలు ఎప్పుడైనా విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.