ETV Bharat / entertainment

రణ్​బీర్​ మొదటి భార్య ఆలియా కాదట.. ఆమె కోసం ఇంకా ఎదురుచూపులు! - రణ్​బీర్​ బ్రహ్మాస్త్రం

Aliabhatt Ranbirkapoor: ఇటీవలే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. ఆలియా భట్​ తన మొదటి భార్య కాదని, తొలి భార్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు!

ranbir first marriage
రణ్​బీర్​ మొదటి భార్య
author img

By

Published : Jun 25, 2022, 9:53 PM IST

Aliabhatt Ranbirkapoor: ఇటీవలే హీరోయిన్​ ఆలియాభట్​ను పెళ్లాడి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మొదటి భార్య కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 'బ్రహ్మాస్త్ర', 'షంషేరా' చిత్రాల ప్రమోషన్స్​లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

కొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు నటించిన బ్రహ్మాస్త్ర, షంషేరా సినిమాలు త్వరలో రిలీజ్‌ అవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచాడీ హీరో. ఈ క్రమంలో తన మొదటి భార్య ఆలియా కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన చాలా క్రేజీగా అనిపించింది. గతంలో ఓ అమ్మాయి మా బంగలా దగ్గరకు వచ్చి మా ఇంటి గేట్​ను పెళ్లాడింది. నేను ఇంటికి రాగానే మా వాచ్​మెన్​ ఈ విషయాన్ని చెప్పాడు. గేటుకు పూలదండ వేసి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు చల్లి.. ఇక నాకు తనకూ పెళ్లి అయిపోయింది అనుకుని వెళ్లిపోయింది. ఆమెను ఇంకా కలవలేదు. తనను కలవాల్సి ఉంది." అని రణ్​బీర్ అన్నారు.

కాగా, ఈ ఏడాది ఏప్రిల్​లో ఆలియా భట్​ను సమీప బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు రణ్​బీర్. వీరిద్దరూ కలిసి నటించిన 'బ్రహ్మస్త్రం'.. సెప్టెంబర్​ 9న విడుదలకానుంది. ఇక రణ్​బీర్, వాణీకపూర్​, సంజయ్ దత్​ ప్రధాన పాత్రల్లో మెరిసిన 'షంషేరా' జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. చివరగా 2018లో వచ్చిన 'సంజు' చిత్రంలో అలరించారు రణ్​బీర్. 'గంగూబాయ్​', 'ఆర్​ఆర్​ఆర్'తో​ అభిమానులను పలకరించిన ఆలియా ప్రస్తుతం హాలీవుడ్​లో చిత్రం 'హార్ట్​ ఆఫ్ స్టోన్'లో నటిస్తోంది.

ఇదీ చూడండి: ప్రభాస్​, చిరంజీవితో సినిమా.. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ రియాక్షన్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.