ETV Bharat / entertainment

'రామారావు ఆన్‌ డ్యూటీ' రిలీజ్​ వాయిదా.. 'పక్కా కమర్షియల్‌' అప్డేట్​ - Rama Rao On Duty

రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్‌ డ్యూటీ' రిలీజ్​ వాయిదా పడింది. అలాగే గోపిచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న 'పక్కా కమర్షియల్‌' మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.

Rama Rao On Duty, Pukka Commercial Movie Release Updates
'రామారావు ఆన్‌ డ్యూటీ' రిలీజ్​ వాయిదా.. 'పక్కా కమర్షియల్‌' అప్డేట్​
author img

By

Published : May 26, 2022, 2:20 PM IST

రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన 'రామారావు ఆన్‌ డ్యూటీ' రిలీజ్​ వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర యూనిట్​ ప్రకటించింది. ఈ సినిమా జూన్‌ 17న విడుదలవుతున్నట్లు గతంలో ప్రకటించింది చిత్ర బృందం. అయితే నిర్మాణాంత కార్యక్రమాలు పూర్తి కానందున సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.మంచి అవుట్‌పుట్‌ రావాలంటే విడుదల తేదీని వాయిదా వేయక తప్పడం లేదని చెప్పారు. కొత్త రిలీజ్​ తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సినిమాలో రజీషా, దివ్యాంశ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. వేణు తొట్టెంపూడి, నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

జులై1న విడుదల

గోపిచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్‌'. ఈ కామెడీ-యాక్షన్‌ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జులై1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలోని అందాల రాశీ.. అనే పాటను జూన్‌1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రం టీజర్‌ మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టైటిల్‌ సాంగ్‌ కూడా అందరినీ ఆకట్టుకుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సత్యరాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నాయకానాయికలు న్యాయవాదులుగా నటిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్‌ సమర్పకులు. రావురమేశ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు.

Rama Rao On Duty
పక్కా కమర్షియల్‌

ఇదీ చదవండి: వారితో డేటింగ్ చేసినప్పుడు​ భయంకరంగా ఉండేది : శృతి హాసన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.