Rajinikanth Sharukh Khan : భారతయ చిత్ర సీమలో ఎంతో మంది బడా స్టార్ హీరోలు ఉన్నారు. ప్రస్తుతం వీరందరిలో ఈ ఏడాది రెండే పేర్లు బాక్సాఫీస్ ముందు సంచలనాలు నమోదు చేశాయి. అవే సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ ఈ అగ్ర హీరోలిద్దరికీ ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తమ కొత్త చిత్రాలతో వసూళ్లను సాధించడమే కాదు భారీ కమ్ బ్యాక్ ఇచ్చి.. బాక్సాఫీస్ ముందు జెండా పాతారు. వందల కోట్ల వసూళ్లతో షేక్ చేసేశారు.
Rajini Jailer Boxoffice Collections : రజనీ కాంత్ స్టార్ డమ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ ఆయన నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. సంచలన వసూళ్లను నమోదు చేశాయి. గత రెండు దశాబ్దాల కాలం చూస్తే.. చంద్రముఖి, శివాజి ది బాస్, రోబో వంటి చిత్రాలతో సరికొత్త రికార్డ్ కలెక్షన్స్ సృష్టించారాయన. అయితే రజనీ చివరిసారిగా సంచలన విజయం అందుకుంది 2010లో వచ్చిన రోబో సినిమాతోనే. ఆ తర్వాత ఒక్కటి కూడా లేదు. కొచ్చాడియన్, కబాలి, లింగ, కాలా, రోబో 2.0, పేటా, దర్బార్, అన్నాత్తే.. ఇలా చాలానే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అవన్నీ భారీ డిజాస్టర్లు లేదా మోస్తరుగా ఆకట్టుకున్నాయి. కానీ ఆయన స్టార్ స్టేటస్‌కు తగ్గట్టుగా భారీ విజయం అందుకోలేదు. రజనీ కెరీర్ డౌన్ అయిపోయిన స్టేజ్‌లో వచ్చిన జైలర్ ఒక్కసారిగా ఆయన కెరీర్ గ్రాఫ్ పెంచింది. రజనీ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ ముందు సత్తా చాటింది. లాంగ్ రన్ టైమ్‌లో ఏకంగా రూ.650కోట్లకు పైగా కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Sharuk Khan Jawan Collections : షారుక్ ఖాన్ పరిస్థితి కూడా ఇలానే ఉందని చెప్పాలి. ఇప్పుడు జవాన్ సినిమాలో తన స్టామినో ఎలా ఉంటుందనేది నిరూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ పై విరుచుకుపడుతోంది. వాస్తవానికి గత దశాబ్ద కాలం చూస్తే.. షారుక్ కూడా తన స్టార్ స్టేటస్‌కు తగ్గట్టుగా ఒక్క సంచలన హిట్ కూడా కనపడలేదు. 2013లో చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంతో ఆయన పెద్ద హిట్‌ను చూశారు. ఆ తర్వాత వచ్చిన దిల్ వాలే, ఫ్యాన్, రేస్ ఇంకా చాలా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. 2018లో వచ్చిన జీరో చిత్రం మరీ దారుణం. లాంగ్ రన్ టైమ్‌లో రూ.100 కోట్లను కూడా అందుకోవడానికి కష్టపడింది. దీంతో షారుక్ చేసేదేమి లేక.. ఐదేళ్ల పాటు మంచి కథల కోసమే సమయం కేటాయించి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అందులో పఠాన్.. ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చి రూ.1000కోట్లను ఖాతాలో వేసుకుంది. మళ్లీ ఏడు నెలల గ్యాప్‌లో వచ్చిన 'జవాన్' రూ.1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.600కోట్లకు పైగా వసూళ్లను అందుకంది. ఇక మిగిలింది డంకీ. ఇది వచ్చే ఏడాది వచ్చే అవకాశముంది. ఇది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. మొత్తంగా ఈ ఏడాది 2023 రజనీ-షారుక్‌కు బాగా కలిసొచ్చింది. ఇద్దరు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. వీరిద్దరి చిత్రాలు కలిపి దాదాపు రూ.2500కోట్ల వరకు వసూలు చేసాయనే చెప్పాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">