Rajinikanth Jailer Collections : ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు పలువురు బడా స్టార్ హీరోల సినిమాలు నడుస్తున్నాయి. వీటిలో రజనీకాంత్ జైలర్, సన్నీ దేఓల్ గదర్ 2 రికార్డ్ కలెక్షన్స్ అందుకుంటుంటే.. అక్షయ్ కుమార్ ఓ మైగాడ్ 2 రోజురోజుకు వసూళ్లను పెంచుకుంటోంది. ఒక్క మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మాత్రం డిజాస్టర్ టాక్‌తో భారీ నష్టాలను అందుకుంది.
రజినీకాంత్ 'జైలర్'కు జోరు ఇంకా తగ్గలేదు. ఏడో రోజు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 2.50 కోట్ల వరకు షేర్ వచ్చిందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 9 కోట్లు వరకూ వసూలు చేసిందట. రూ. 22 కోట్లు వరకు గ్రాస్‌ను అందుకుందట. మొత్తంగా ఇప్పటి వరకూ రూ.425 కోట్లు గ్రాస్ వసూలు చేసి.. 'విక్రమ్' రికార్డును బ్రేక్ చేసేసింది.
Chirajeevi Bholashankar Collections : ఈ సినిమా వసూళ్లు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 79.60 కోట్లు బిజినెస్ చేసుకోగా.. ఇప్పటివరకు ఆరు రోజుల్లో కనీసం కనీసం రూ.30 కోట్ల షేర్ కూడా అందుకోలేదు. ఆరో రోజు ఈ చిత్రానికి భారీగా డ్రాప్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 30 లక్షల షేర్ వచ్చిందని తెలిసింది. ప్రపంచవ్యాప్తందా రూ. 40 లక్షల వరకు వచ్చిందట. మొత్తంగా కేవలం రూ. 27.30 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమాకు ఇంకా రూ. 53 కోట్ల వరకు రావాలి అన మాట.
Sunny Deol Gadar 2 Collections : 'గదర్ 2' బాక్సాఫీస్ ముందు ప్రభంజనం సృష్టిస్తోంది. 6వ రోజు కూడాభారీ వసూళ్లను అందుకుంది. సన్నిడియోల్ కెరీర్‌లోనే అత్యుత్తమ కలెక్షన్లను అందుకుంది. ఆరో రోజు 36 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలిసింది. మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ ముందు రూ.264 కోట్ల కలెక్షన్లను అందుకోగా.. వరల్డ్ వైడ్‌గా రూ.332 కోట్ల కలెక్షన్లను సాధించింది. దీంతో షారుక్ పఠాన్ రికార్డ్ కూడా బ్రేక్ అయింది. పఠాన్ మూవీ ఆరో రోజు రూ.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. గదర్ 2 మాత్రం రూ.36 కోట్లు అందుకుంది. అదే ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా పఠాన్ రూ. 295 కోట్ల రూపాయలు అందుకుంటే గదర్ 2 రూ. 332 కోట్లను అందుకుంది. అక్షయ్ కుమార్ ఓమై గాడ్ 2కు కూడా ఆరో రోజు మంచిగానే వసూళ్లు వచ్చాయట.
టాలీవుడ్లో కోలీవుడ్ ధమాకా.. షాకింగ్ బిజినెస్.. ఈ సినిమాలు వసూళ్ల మోత మోగిస్తున్నాయిగా!