ETV Bharat / entertainment

Miss India 2023 : మిస్‌ ఇండియా కిరీటం.. ఈ రాజస్థానీ అందానికే సొంతం..! - నందిని గుప్తా మిస్ ఇండియా 2023

మణిపూర్​ వేదికగా ఆదివారం ఫెమీనా మిస్‌ ఇండియా ఫైనల్స్​ అట్టహాసంగా జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల అందాల భామ నందిని గుప్తా గెలుపొంది కిరీటాన్ని దక్కించుకుంది.

rajasthans-nandini-gupta-wins-femina-miss-india-2023
nandini gupta
author img

By

Published : Apr 16, 2023, 7:02 AM IST

Updated : Apr 16, 2023, 10:32 AM IST

ఫ్యాషన్‌ రంగంలోని ప్రతిష్టాత్మక 'ఫెమీనా మిస్‌ ఇండియా' కిరీటాన్ని ఈ ఏడాది రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా దక్కించుకున్నారు. ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు కూడా హాజరయ్యారు. అన్ని పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జడ్జీల హృదయాలను గెలుచుకున్న 19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచి మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలుపొందారు.

గతేడాది జరిగిన పోటీల్లో మిస్‌ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి ఇప్పటి విజేతకు కిరీటాన్ని అలంకరించారు. పోటీల్లో దిల్లీకి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరప్‌గా నిలవగా.. మణిపూర్‌కు చెందిన తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌ స్థానానికి పరిమితమయ్యారు. మరోవైపు ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతిలు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహాన్‌లు ఈ మిస్‌ ఇండియా పోటీల్లో తుది వరకూ గట్టి పోటీనిచ్చారు.

59వ ప్రతిష్టాత్మక ఫెమీనా మిస్‌ ఇండియా పోటీల్లో భాగంగా దిల్లీతో సహా 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు ఈ కంటెస్టెంట్‌లో పాల్గొన్నారు. కేవలం తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జీల ప్రశంసలు అందుకున్నారు. తుది పోరులో అదరగొట్టిన నందిని గుప్తా ఎట్టకేలకు కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మణిపూర్‌లోని కుమన్‌ లంపక్‌ ఇండోర్‌ స్టేడియంలో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్​ సినీ తారలు కార్తిక్‌ ఆర్యన్‌, అనన్య పాండే హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ఈ ఇద్దరు డ్యాన్స్‌ చేసి ఆహూతులను అలరించారు. వీరితో పాటు 2022 మిస్‌ ఇండియా విజేత సినీ శెట్టి, స్టార్స్‌ రుబెల్‌ షెకావత్‌, షింతా చౌహాన్‌, మానస వారణాసి, మనికా షియోఖండ్‌, మాన్య సింగ్‌, సుమన్‌ రావు, శివానీ జాదవ్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ఇక నందిని కెరీర్​ గ్రాఫ్​ విషయానికి వస్తే.. రాజస్థాన్‌లోని కోటలో జన్మించిన నందిని.. చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేవారు. చదువులో మేటి అయిన ఈ అమ్మాయి సెయింట్ పాల్ సీనియర్ సెకండరీ స్కూల్​లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం లాలా లజపతిరాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్స్​ చదువుతున్నారు. పదేళ్ల ఏళ్ల వయస్సు నుంచే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్న నందిని.. ఎప్పటికైనా ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకున్నారు నందిని.

rajasthans-nandini-gupta-wins-femina-miss-india-2023
వేడుకలో బాలీవుడ్​ స్టార్​ కార్తిక్​ ఆర్యన్​

Last Updated : Apr 16, 2023, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.