ETV Bharat / entertainment

ప్రాజెక్ట్​-K నుంచి క్రేజీ అప్డేట్​.. స్క్రాచ్ నుంచి వచ్చిన టైర్​.. వీడియో అదుర్స్​!

author img

By

Published : Dec 31, 2022, 1:07 PM IST

Updated : Dec 31, 2022, 1:31 PM IST

మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల దర్శకుడు నాగ్​ అశ్విన్.. ప్రాజెక్ట్-కె మూవీలోని ఓ వీడియోను తాజాగా రిలీజ్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

Project K Movie New Video
Project K Movie

డార్లింగ్​ ప్రభాస్, బాలీవుడ్​ భామ దీపికా పదుకొణె జంటగా రాబోతున్న సినిమా 'ప్రాజెక్ట్- కె'. ప్రముఖ హిందీ నటుడు అమితాబ్​ బచ్చన్ కీలక పాత్రలో పోషించనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. వైజయంతీ ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ప్రాజెక్ట్- కెలో కీలకంగా నిలిచే వాహనాల టైర్ల తయారీతో కూడిన స్పెషల్​ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. ప్రాజెక్టు-కె గ్యారెజ్​లో స్క్రాచ్ నుంచి ఒక టైర్​ను ఎలా తయారు చేశారో చూపిస్తూ.. సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్న వీడియోను షేర్​ చేశారు. కాగా, ఈ చిత్రానికి ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్ర కీలక సహకారాన్ని అందిస్తుండటం విశేషం.

Last Updated : Dec 31, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.