ETV Bharat / entertainment

థ్రిల్లర్​ గ్లింప్స్​ : డేంజరస్ వైఫ్​గా ప్రియమణి - ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్​గా భూమి పెడ్నేకర్ - ప్రియమణి భామాకలాపం 2

Priyamani Bhamakalapam 2 Glimpse : ప్రియమణి నటించిన 'భామాకలాపం 2' ​గ్లింప్స్​ విడుదలైంది.మరో హీరోయిన్​ భూమి పెడ్నేకర్‌ నటించిన 'భక్షక్‌' మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు చిత్రాల గ్లింప్స్ థ్రిల్లింగ్​గా ఉన్నాయి. మీరు చూశారా?

థ్రిల్లర్​ గ్లింప్స్​ : డేంజరస్ వైఫ్​గా ప్రియమణి - ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్​గా భూమి పెడ్నేకర్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 5:28 PM IST

Priyamani Bhamakalapam 2 Glimpse : ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు అందిస్తున్న ఆహా ఓటీటీ నుంచి తాజాగా మరో సినిమా రానుంది. ఇదివరకే గతంలో ఆహా ఓటీటీలో 'భామాకలాపం' సినిమా రిలీజై మంచి సక్సెస్​ను అందుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్​ రానుంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీరత్‌ కపూర్‌, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్​ గ్లింప్స్​ వీడియోను రిలీజ్​ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ప్రియమణి, శరణ్య సస్పెన్స్ డైలాగ్స్‌ మరింత ఆసక్తిని పెంచాయి. ప్రియమణి, శరణ్య ఇద్దరూ ఏదో ఇల్లీగల్​ పని చేయడానికి వెళ్తున్నట్లుగా చూపించారు. 'చెరో 25 లక్షలు. ఇద్దరికి కలిపి 50 లక్షలు. ఎన్ని ఇడ్లీలు అమ్మితే అంత డబ్బు వస్తుంది' అని శరణ్య చెప్పే డైలాగ్​తో ప్రారంభమైన ఈ గ్లింప్స్​లో 'మనం చేస్తుంది కరెక్టేనా' అని ప్రియమణి అడగగా - 'అసలు ఇది మొదలు పెట్టిందే మీరు. మీరు మాములు వైఫా - డేంజరస్ వైఫ్' అని శరణ్య చెప్పడం క్యూరియాసిటినీ పెంచింది. ఫైనల్​గా ఇద్దరూ మొహానికి మంకీ క్యాప్ పెట్టుకుని నడుచుకుంటూ రావడం, బ్యాక్ గ్రౌండ్​లో మ్యూజిక్​ రావడం అంతా ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhaksha Teaser : హీరోయిన్ భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'భక్షక్‌'. పులకిత్‌ దర్శకుడు. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్​పై షారుక్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌లు సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ టీజర్‌ను రిలీజ్ చేసింది. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్‌ వైశాలీ సింగ్‌ పాత్రలో భూమి పెడ్నేకర్‌ ఆకట్టుకున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించింది? ఆధారాలతో వాటిని ఎలా బయటపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? అనేదే ఈ కథ.

బాలయ్య కొత్త సినిమాకు చిరంజీవి స్పెషల్ విషెస్ - ఆనందంలో ఫ్యాన్స్​!

రూ.200కోట్ల వెబ్​సిరీస్- ఇండియాలోనే కాస్ట్లీ- షారుక్ మూవీ బడ్జెట్​ కన్నా ఎక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.