ETV Bharat / entertainment

114 రోజుల్లో షూటింగ్​ - ఆ సీక్రెట్​ రివీల్​ చేసిన 'సలార్' డైరెక్టర్​! - సలార్ మూవీ షూటింగ్

Prabhas Salaar Movie : ప్రభాస్​, పృథ్వీరాజ్​ సుకుమారన్ లీడ్ రోల్స్​లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'సలార్​'. ట్రైలర్​తో ఫ్యాన్స్​కు గూస్​బంప్స్​ తెప్పించిన ఈ సిినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్​ నీల్​. అవేంటంటే ?

Prabhas Salaar Movie
Prabhas Salaar Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 9:27 AM IST

Prabhas Salaar Movie : మూవీ లవర్స్​ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్​ రానే వచ్చింది. వచ్చిన కొద్ది నిమిషాల్లోనే కొన్ని వేల లైక్స్​తో షేక్​ చేసింది ఆ వీడియో. 'సలార్​' మీద ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి అలాంటిది మరి. టీజర్ ఇచ్చిన అంచనాలతో ట్రైలర్​పై బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్​కు ఫలితం బాగానే దక్కింది. ప్రభాస్​ మాస్​ ర్యాంపేజ్​.. పృథ్వీరాజ్​ యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్కటి ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రభాస్​సు కూడా ఈ మూవీ మంచి కమ్​ బ్యాక్​ ఇచ్చేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

మరోవైపు డైరెక్టర్ ప్రశంత్​ నీల్ తన మార్క్​ను ఈ సినిమాలో స్పష్టంగా చూపించినట్లు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. విజువల్స్​ నుంచి స్టార్ల ఎంపిక వరకు అన్నింటి విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ప్రశాంత్ నీల్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'సలార్'ను తెరకెక్కించాలన్న ఆలోచన ఆయనకు 15 ఏళ్ల క్రితమే వచ్చిందని.. అయితే తన తొలి సినిమా 'ఉగ్రమ్' తర్వాత ఆయన 'కేజీఎఫ్' చిత్రీకరణలో బిజీ అయిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో 8 ఏళ్ల తర్వాత 'సలార్​'ను పట్టాలెక్కించారని వెల్లడించారు. ఇక 'సలార్' సినిమాను భారత్​లోని వివిధ ప్రాంతాల్లో షూట్​ చేసినట్లు తెలిపారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిందని.. ఆ తర్వాత సింగరేణి గనులు, వైజాగ్, మంగళూరు ఓడరేవుల్లో కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఈ సినిమాలో కొంత భాగాన్ని యూరప్‌లోనూ షూట్​ చేశారని చెప్పారు. అలా షూటింగ్ మొత్తాన్ని 114 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ మాట విన్న ఫ్యాన్స్ షాక్​కు గురయ్యారు.. అంత పెద్ద సినిమాను ఇంత తక్కువ సమయంలో ఎలా చిత్రీకరించారని ఆశ్చర్యపోతున్నారు. మూవీ టీమ్ బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యపడుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని సమాచారం. దీంతో ఫ్యాన్స్​ నిరాశ చెందుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రభాస్ మాస్ ర్యాంపేజ్​- 'సలార్' ట్రైలర్​ రిలీజ్​

Salaar KGF : కేజీఎఫ్​తో సలార్​కు నిజంగానే కనెక్షన్​ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.