ETV Bharat / entertainment

Tollywood: ఈ స్టార్ హీరోల కొత్త చిత్రాల కబుర్లు విన్నారా? - ఎన్టీఆర్​ 30 కొరటాల సినిమా అప్డేడ్​

స్టార్ హీరోలకు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్స్​ కబుర్లు ఫిల్మ్​ నగర్​ సర్కిల్​లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రభాస్​, ఎన్టీఆర్​, రామ్​చరణ్​, మహేశ్ బాబు, దళపతి విజయ్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటంటే..

Prabhas NTR Mahesh Vijay
Tollywood: ఈ స్టార్ హీరోల కొత్త చిత్రాల కబుర్లు విన్నారా?
author img

By

Published : Nov 1, 2022, 10:00 AM IST

ఎన్టీఆర్‌ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అనే ప్రకటన రాగానే అభిమానులు చాలా సంతోషించారు. మళ్లీ ఆ తర్వాత సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి సంగతులు బయటకు రాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా ఆగిపోయిందని, దర్శకుడు మారిపోయారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో చిత్రబృందానికి చెందిన పీఆర్వో ట్విటర్‌ వేదికగా స్పందించారు. "దర్శకుడు కొరటాల శివ, డీవోపీ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌ ‘ఎన్టీఆర్‌ 30’ పూర్వ నిర్మాణ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

2024 వేసవి లక్ష్యంగా.. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'ప్రాజెక్ట్‌ కె'(వర్కింట్‌ టైటిల్‌). ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని 2024 వేసవి లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికిగానీ 2023 ప్రారంభంలోగానీ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారట. ప్రేక్షకులకు ఓ విజువల్‌ వండర్‌లా ఈ సినిమాని చూపించడం కోసం విఎఫ్‌ఎక్స్‌ పనుల కోసం కూడా చిత్రబృందం ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటోదట. అవన్నీ పూర్తి చేసి 2024కి సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు రచించినట్టు సమాచారం.

ముందున్నాయి మరిన్ని కబుర్లు.. మహేష్‌బాబు- త్రివిక్రమ్‌ కలయికలో వస్తోన్న సినిమాని శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వినోదం పంచాలని చిత్రబృందం శ్రమిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా రెండో షెడ్యూల్‌ మొదలు కానుంది అంటూ చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముందుముందు మరిన్ని ఆసక్తికరమైన తాజా కబుర్లు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి అని ఆయన చెప్పారు. తివిక్రమ్‌ శైలిలో సాగుతూనే యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిదని తెలుస్తోంది. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌- త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రమిది.

జపాన్​లో విజయ్​.. మన సినిమాలకు జపాన్‌లోనూ మంచి గిరాకీ ఉంది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ అక్కడ విడుదలై ఆకట్టుకుంటోంది. తాజాగా మరో చిత్రం జపనీయుల్ని అలరించనుంది. విజయ్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన మాస్టర్‌ చిత్రం జపాన్‌లో సెన్‌సేయి పేరుతో నవంబరు 18న విడుదల కానుంది. లోకేష్‌ కనగరాజ్‌ ఖైదీ కూడా గతంలో జపాన్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. సాధారణంగా తమిళ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణే ఉంటుంది. రజనీకాంత్‌ ముత్తు అక్కడ విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సల్మాన్ చిత్రంలో చరణ్ స్టెప్పులు.. చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌ చిత్రంలో అతిథి పాత్రలో అలరించడమే కాదు చిరుతో కలిసి ఓ మాస్‌ గీతానికి స్టెప్పులేశారు సల్మాన్‌ఖాన్‌. ఈసారి సల్మాన్‌ చిత్రంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఆడిపాడబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ కథానాయకుడిగా 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్‌తో పాటు చరణ్‌ అతిథి పాత్రల్లో మెరవనున్న సంగతి తెలిసిందే. "చరణ్‌, సల్మాన్‌ కలిసి ఓ పాటలో నటించనున్నారు. ఇది ప్రత్యేక గీతమే కానీ ఐటమ్‌ పాట కాదు. చరణ్‌ మంచి డ్యాన్సర్‌ కావడంతో ఆయన ప్రతిభ సినిమాకి కలిసి రావాలని సల్మాన్‌ ఇదంతా ప్లాన్‌ చేస్తున్నారు" అని సల్మాన్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.

ఇదీ చూడండి: అందాల తార ఐశ్వర్యా రాయ్​ అరుదైన చిత్రాలను చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.