'కేజీయఫ్' సిరీస్‌తో యావత్ దేశాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటించి బిజీగా గడుపుతున్నారు. అలా తన సినిమాలతో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన నీల్.. ప్రస్తుతం ప్రభాస్‌తో 'సలార్' చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంకాస్త మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైపోయారు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారు. అయితే ఇవి ఇలా ఉండగనే ప్రశాంత్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
ఇటీవలే 'వారుసుడు' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న దిల్ రాజు.. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి మూడు చిత్రాలు రాబోతున్నట్లు తెలిపారు. అందులో మోహనకృష్ణ ఇంద్రగంటితో 'జటాయు', శైలేష్ కొలనుతో 'విశ్వంభర', ప్రశాంత్ నీల్‌తో 'రవణం' మూవీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇది ప్రకటించిన కాసేపటికే నెట్టింట్లో ఓ కొత్త ప్రచారం అందుకుంది. రవణం చిత్రాన్ని ప్రశాంత్..ప్రభాస్‌తోనే చేయనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. భారీ వీఎఫ్ఎక్స్తో పీరియాడికల్ డ్రామాగా రూపొందనుందని అంటున్నారు. ఒకవేళ ఇది కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి.