ETV Bharat / entertainment

'బిగ్‌బాస్‌ సీజన్‌ 6' విజేత సింగర్‌ రేవంత్‌.. చివర్లో ట్విస్ట్‌ సూపర్! - బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 6 విజేత ఎవరు

Bigg Boss Telugu 6 : 'బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6' విజేతగా తెలుగు సినీ ప్లేబ్యాక్​ సింగర్​ రేవంత్‌ నిలిచారు. ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఫైనల్​లో విజయం రేవంత్​ని వరించింది. ఈ సీజన్​లో 21 మంది కంటెస్టెంట్​లు టైటిల్​ కోసం పోటీ పడ్డారు.

bigboss 6 winner playback singer revanth

author img

By

Published : Dec 18, 2022, 10:52 PM IST

Bigg Boss Telugu 6 : 'బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6' విజేతగా తెలుగు సినీ నేపథ్య గాయకుడు రేవంత్‌ నిలిచారు. ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్‌లు పోటీ పడగా.. రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, కీర్తి భట్‌, రోహిత్‌లు టాప్‌-5కు చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్‌ ఫినాలెలో తొలుత రోహిత్‌, తర్వాత ఆదిరెడ్డి, మూడో వ్యక్తిగా కీర్తి ఎలిమినేట్‌ అయి హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. టైటిల్‌ పోరులో టాప్‌-2లో శ్రీహాన్‌, రేవంత్‌ నిలిచారు. ఈ సందర్భంగా గోల్డెన్‌బాక్స్‌తో హౌస్‌లోకి వచ్చిన నాగార్జున ఇద్దరికీ అదిరే ఆఫర్‌ ఇచ్చాడు. ప్రైజ్‌ మనీలో సగం మొత్తం తీసుకుని హౌస్‌ నుంచి వెళ్లిపోవచ్చని సూచించాడు. తొలుత ఇద్దరూ ససేమిరా అన్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.30లక్షలకు పెంచారు. అప్పుడు కూడా ఇద్దరూ అంగీకరించలేదు. చివరికి ఆ మొత్తాన్ని రూ.40లక్షలు చేయడంతో శ్రీహాన్‌ ఆ మొత్తం తీసుకున్నాడు. దీంతో రేవంత్‌ బిగ్‌బాస్‌-6 ట్రోఫీ, రూ.10లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్‌ రూ.40లక్షలు గెలుచుకోవడం గమనార్హం.

bigboss 6 winner playback singer revanth
రేవంత్

ఇక ఆదివారం జరిగిన ఫినాలే ఎపిసోడ్‌ ఆద్యంతం అలరించింది. ఈ సీజన్‌లో ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన హౌస్‌మేట్స్‌ అందరూ షోకు విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ వీక్షకులను అలరించాయి. ఇక ఇంటి నుంచి వెళ్లిపోయిన హౌస్‌మేట్స్‌లో అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారని ఫైనలిస్ట్‌లను అడగ్గా, మెరీనాకు బెస్ట్‌ చెఫ్‌, శ్రీ సత్యకు బెస్ట్‌ స్లీపింగ్‌ స్టార్‌, ఫైమాకు బెస్ట్‌ డ్యాన్సర్‌, రాజ్‌కు బెస్ట్‌ గేమర్‌, అర్జున్‌ కల్యాణ్‌కు బెస్ట్‌ లవర్‌ అవార్డులు ఇచ్చారు. అలనాటి నటి రాధ, యువ నటుడు నిఖిల్‌, మాస్‌ హీరో రవితేజ, అందాల భామ శ్రీలీల తదితరులు ఫినాలే ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-6 హైలైట్స్‌ ఇవే!

  • బిగ్‌బాస్‌ సీజన్‌-6 ఈ ఏడాది సెప్టెంబరు 4వ తేదీ నుంచి మొదలైంది. మొత్తం 105 రోజుల పాటు సీజన్‌ కొనసాగింది. ఈసారి కూడా అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
  • వివిధ రంగాలకు చెందిన మొత్తం 21 మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొనడం విశేషం. అయితే, ఈసారి ఎలాంటి వైల్డ్‌ కార్డు ఎంట్రీలను అనుమతించలేదు. అలాగే ఏ కంటెస్టెంట్‌నూ సీక్రెట్‌ రూమ్‌లోనూ ఉంచలేదు.
  • తాజా సీజన్‌లో రేవంత్‌, శ్రీహాన్‌, కీర్తి, ఆది, రోహిత్‌, శ్రీసత్య, ఇనయ, ఫైమా, రాజ్‌, మెరీనా, వసంతి, బాలాదిత్య, గీతూ రాయల్‌, సూర్య, అర్జున్‌, సుదీప, చలాకీ చంటి, ఆరోహి, నేహా, అభినయ, షానీ సాల్మన్‌లు పాల్గొన్నారు. విన్నర్‌ అయిన రేవంత్‌కు రెండుసార్లు కెప్టెన్‌గా చేసే అవకాశం దక్కింది.
  • ఈ సీజన్‌లో టాప్‌-5లో ఉంటారని ఆశించిన కంటెస్టెంట్‌లు మధ్యలో వెళ్లిపోవడం గమనార్హం. చలాకీ చంటి ఎలిమినేషన్‌ను ఎవరూ ఊహించలేదు. ఒకట్రెండు వారాలు బాగానే ఆడిన చంటి, ఆ తర్వాత పూర్తిగా డల్‌ అయిపోయాడు. దీంతో 35వ రోజు హౌస్‌ నుంచి వెళ్లిపోయాడు. అలాగే తనదైన గేమింగ్‌తో హౌస్‌మేట్స్‌తో ఓ ఆటాడుకున్న గీతూ రాయల్‌ కూడా మధ్యలోనే వెళ్లిపోయింది.
  • ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా వచ్చిన మొదటి వారమే ఒకరిని ఎలిమినేట్‌ చేసి పంపేవారు. అయితే, ఈసారి మాత్రం రెండు వారాలు సమయం ఇచ్చారు. అలా ఇంటి నుంచి మొదట షానీ(13వ రోజు) ఎలిమినేట్‌ కాగా, ఆ మరుసటి రోజే అభినయ (14వ రోజు) కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుసగా నేహా (21వ రోజు), ఆరోహి (28వ రోజు), చంటి (35వ రోజు), సుదీప (42వ రోజు), అర్జున్‌ (49వ రోజు), సూర్య (55వ రోజు), గీతు (63వ రోజు), బాలాదిత్య (69వ రోజు), వసంతి (70వ రోజు), మెరీనా (77వ రోజు), రాజ్‌ (84వ రోజు), ఫైమా (91వ రోజు), ఇనయ (98వ రోజు), శ్రీసత్య (103)లు ఉన్నారు.
  • సీజన్‌-6లో పలువురు సినీ తారలు వేదికపై సందడి చేశారు. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌, సుధీర్‌బాబు, కృతిశెట్టి, అమల, శర్వానంద్‌, తమన్నా, రితికా సింగ్‌, రుక్సార్‌, శ్రద్ధాదాస్‌, సోనాల్‌ చౌహాన్‌, ప్రవీణ్ సత్తారు, రమ్య బెహర, శ్రావణ భార్గవి, శ్రీకృష్ణ, దేవిశ్రీ ప్రసాద్‌, అవికా గోర్‌, రష్మి, అంజలి, శ్రీరామ చంద్ర, హైపర్‌ ఆది, కార్తి, రజీషా విజయన్‌, సోహైల్‌, శివ బాలాజీ, రోల్‌రైడా, అడవి శేష్‌, మీనాక్షి చౌదరి, తదితరులు వేదికపైకి వచ్చి, హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.