ETV Bharat / entertainment

వినోదయ సీతమ్​.. పవన్​-సాయితేజ్​తో పాటు ఇంకెవరు నటిస్తున్నారంటే? - వినోదయ సీతమ్​ రీమేక్ హీరోయిన్​ కేతిక శర్మ

పవన్​ కల్యాణ్​-సాయితేజ్​ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్​ సినిమా 'వినోదయ సీతమ్'​ రీమేక్​లో నటించనున్న నటులు వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం వారి పేర్లు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఇంతకీ ఎవరెవరు నటిస్తున్నారంటే?

vinodaya seetham remake actors
వినోదయ సీతమ్ రీమేక్ యాక్టర్స్​
author img

By

Published : Feb 28, 2023, 5:38 PM IST

Updated : Feb 28, 2023, 6:31 PM IST

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​, సుప్రీమ్​ స్టార్​ సాయి ధరమ్​ తేజ్​ కాంబోలో ఓ రీమేక్​ మూవీ తెలుగులోకి రానుంది. వినోదాయ సీతమ్​ అనే తమిళ హిట్​ సినిమాకు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​పై ప్రేక్షకుల్లో హై ఎక్స్​పెక్టేషన్స్​ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో పవన్​ సాయితేజ్​తో పాటు ఎవరెవరు నటిస్తారన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇప్పటికీ రాలేదు. అప్పట్లో కేతికా శర్శ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్నట్లు టాక్​ వచ్చింది.

అయితే తాజాగా మేకర్స్​ ఇచ్చిన సమాచారం ప్రకారం పవన్​ కల్యాణ్​, సాయిధరమ్​ తేజ్​తో పాటు, మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్​ వారియర్​, కేతిక శర్మ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి, సుబ్బరాజు, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌తో పాటు వివేక్‌ కూచిబొట్లలు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సంభాషణలు అందిస్తున్నారు.మ్యూజిక్​ డైరెక్టర్​గా ఎస్‌ తమన్​ వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే పవన్​ కల్యాణ్​ సినిమాల విషయానికొస్తే.. ఆయన త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రాన్ని ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. దీంతో పాటే పవన్​.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్​ భగత్ సింగ్​ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఇది ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. అలాగే సాహో దర్శకుడు సుజిత్​తో OG అనే సినిమా చేస్తున్నారు.

ఇక సాయితేజ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం.. మిస్టీక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'విరూపాక్ష'లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆడియెన్స్​ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మూవీటీమ్ అంటున్నారు. ఈ మూవీని కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రూపొందుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ చిత్రంలో సాయితేజ్​ భయపడకుండా ఓ ప్రమాదకర బైక్‌ సీక్వెన్స్‌ను ధైర్యంగా చేశాడని దర్శకుడు కార్తీక్‌ తెలిపారు.

ఇదీ చూడండి: సెట్​లో సమంతకు గాయాలు.. యాక్షన్​లోకి ప్రియాంక చోప్రా

Last Updated : Feb 28, 2023, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.