ETV Bharat / entertainment

ఒకే సెట్​లో బాలయ్య-పవన్​.. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​.. మీటింగ్ అందుకేనా? - బాలకృష్ణను కలిసిన బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ- పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. తమ ఫ్యాన్స్​కు డబుల్​ ధమాకా ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఒకే చోట సందడి చేశారు.

pawan kalyan balakrishna
pawan kalyan balakrishna
author img

By

Published : Dec 23, 2022, 5:18 PM IST

Updated : Dec 23, 2022, 7:12 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ-పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ ఒకే వేదికపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే అందుకు తగ్గట్టే అన్​స్టాపబుల్​ షోకు పవన్​ గెస్ట్​గా రాబోతున్నారని ప్రచారం సాగడంతో ఫ్యాన్స్​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో పవన్​ ఆ షోకు ఎప్పుడెప్పుడు వస్తారా.. వీరిద్దరు కలిసి ఎలా సందడి చేస్తారా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూడటం ప్రారంభించారు. తాజాగా ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా.. ఫ్యాన్స్​కు డబుల్​ ధమాకా ఇచ్చారు ఈ ఇద్దరు స్టార్స్​. వీరిద్దరూ కలిసి ఓకే చోటు సందడి చేశారు.

వీరసంహారెడ్డి సెట్​లో.. వీరసింహారెడ్డి సెట్​లో బాలయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు పవన్​ కల్యాణ్. వీరసింహారెడ్డిలోని చివరి సాంగ్​ షూటింగ్​.. పవన్​ కల్యాణ్​ హరిహర వీరమల్లు చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్​లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్యను వెళ్లి కలిశారు పవన్. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు జై బాలయ్య, జై పవర్​స్టార్ అంటూ తెగ ట్రెండ్​ చేస్తున్నారు. అన్​స్టాపబుల్​ షోలో పవన్​ కల్యాణ్​ రాకకు ఈ మీట్​ సంకేతమని ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు.

pawan kalyan balakrishna
బాలకృష్ణను కలిసిన పవన్​ కల్యాణ్

ఇక పవన్​-బాలయ్య అన్​స్టాపబుల్​ షో విషయానికొస్తే.. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ ఆడియెన్స్​లో బాగా నెలకొంది. వీరిద్దరి మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ ఉండబోతోంది, పవన్ వ్యక్తిగత జీవితం గురించి బాలయ్య ఏమని ప్రశ్నిస్తారు? అని చాలా అనుమానాలు అభిమానుల్లో మెదులుతున్నాయి. ఇకపోతే ఈ ఎపిసోడ్​కు దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలిసింది. ఇంకా ఈ ఎపిసోడ్​లో మరో బిగ్ సర్​ప్రైజ్​ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. షో మధ్యలో బాలకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి మధ్య సరదా ఫోన్ సంభాషణ కూడా ఉండనుందట.
పవన్​ను సరదాగా ఆటపట్టించే విషయాలని బాలయ్య చిరంజీవిని అడిగి తెలుసుకోబోతున్నట్లు టాక్. మొత్తంగా ఈ ఎపిసోడ్​ నిజంగా ఉందో లేదో తెలియదు గానీ.. వైరలవుతున్న ఈ ప్రశ్నలు మాత్రం ఆడియెన్స్​లో తెగ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Last Updated : Dec 23, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.