ETV Bharat / entertainment

'హరిహర వీరమల్లు' క్రేజీ బజ్​.. ఓటీటీలోకి 'గంగూబాయి' - ఆలియా భట్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. తాజాగా ఈ మూవీ షూటింగ్​ మళ్లీ మొదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త.. నెట్టంట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. ఆలియా భట్​ నటించిన 'గంగూబాయి కాఠియావాడి' సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

PAVAN KALYAN Ganagubhai kathiawadi
PAVAN KALYAN Ganagubhai kathiawadi
author img

By

Published : Apr 20, 2022, 4:07 PM IST

Pawan Kalyan Hari Hara Veeramallu: 'భీమ్లానాయక్‌' విజయంతో జోరుమీదున్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన కీలక పాత్రలో క్రిష్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా 'హరి హర వీరమల్లు'. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఇప్పటికే 50శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగారు పవన్‌. ఇటీవల మొదలైన తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు, ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

PAVAN KALYAN Ganagubhai kathiawadi
'హరిహర వీరమల్లు'

Pavan Kalyan Getup: ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్ర యోధుడిలా రాబిన్‌హుడ్‌ను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో పవన్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. మూడు పాత్రల్లోనూ 'హరి హర వీరమల్లు' పాత్రదే స్పెషల్‌ అట్రాక్షన్‌ అంటున్నారు. ఈ సినిమాలో పవన్‌ పాత్రలను దృష్టిలో పెట్టుకుని 30 రకాల విభిన్న దుస్తులు సిద్ధం చేసిందట చిత్ర బృందం. ప్రతి డ్రెస్‌ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట. మరి పవన్‌కల్యాణ్‌ ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా కోసం పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇక తెరపై 'వీరమల్లు'గా పవన్‌ విజృంభణ చూసేందుకు అభిమానులు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు.

PAVAN KALYAN Ganagubhai kathiawadi
'గంగూబాయి కాఠియావాడి'

GanguBhai Kathiawadi OTT Streaming: సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఓటీటీ రిలీజ్‌ 'గంగూబాయి కాఠియావాడి'. ఆలియాభట్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి.. హిట్‌ అందుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడా అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే గంగూబాయి.. ఓటీటీ రాకపై అప్‌డేట్‌ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 26 నుంచి 'గంగూబాయి కాఠియావాడి' అందుబాటులో ఉండనుంది.

ఇవీ చదవండి: కాజల్ ముద్దుల కుమారుడి పేరేంటో తెలుసా?

'రాధేశ్యామ్'​ రిజల్ట్​పై ప్రభాస్​ కామెంట్స్​.. ఆ లేడీ డైరెక్టర్​తో రోషన్​ మూవీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.