ETV Bharat / entertainment

పవన్​- సాయి​ధరమ్​ తేజ్​ సినిమా ఫిక్స్​.. సెట్స్​పైకి అప్పుడే! - సాయి ధరమ్​ తేజ్​

'భీమ్లానాయ‌క్' సినిమా త‌ర్వాత మ‌రో రీమేక్​కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న 'వినోదయ సీత‌మ్' రీమేక్​లో ప‌వ‌న్‌క‌ల్యాణ్​, సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా న‌టించబోతున్నారు. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందట. మరోవైపు, పవన్​ మరో రీమేక్​ కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని టాక్​ వినిపిస్తోంది.

pawan kalyan sai dharam tej
pawan kalyan sai dharam tej
author img

By

Published : Apr 30, 2022, 3:48 PM IST

PavanKalyan SaiDharam Tej Remake: 'భీమ్లానాయ‌క్' సినిమాతో ఈ ఏడాది అతి పెద్ద విజ‌యాన్ని అందుకున్నారు పవర్​ స్టార్​ ప‌వ‌న్‌క‌ల్యాణ్​. మ‌ల‌యాళ చిత్రం 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్' ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రెండు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రో రీమేక్‌గా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు.

స‌ముద్ర‌ఖ‌ని, తంబిరామ‌య్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళంలో రూపొందిన 'వినోదయ సీత‌మ్' చిత్రం క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్​తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. యాక్సిడెంట్‌లో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తి.. దేవుడి అంగీకారంతో తిరిగి తొంభై రోజుల పాటు జీవించే అవకాశాన్ని పొందిన తర్వాత ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుంది. ఇందులో మ‌రో హీరోగా సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్నారు. మామ అల్లుళ్ల క‌ల‌యిక‌లో రూపొంద‌నున్న తొలి సినిమా ఇదే కావ‌డం వల్ల మెగా అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.

త‌మిళ వెర్ష‌న్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ముద్ర‌ఖ‌ని తెలుగు రీమేక్‌కు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని క‌థ‌లో చాలా మార్పులు చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిసింది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్న‌ట్లు స‌మాచారం. జీస్టూడియోస్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. ఇదిలా ఉంటే.. గబ్బర్‌ సింగ్‌, కొమరం పులి, భీమ్లానాయక్‌ వంటి చిత్రాల్లో పోలీస్‌ పాత్రలో నటించి అభిమానులను మెప్పించిన పవన్‌ మరోసారి ఖాకీ డ్రస్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్‌ చిత్రం 'తేరి' సినిమా రీమేక్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి: అల్లుఅర్జున్​ బాటలో యశ్​.. ఆ యాడ్​కు నో.. ఫ్యాన్స్ ఖుష్​​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.