ETV Bharat / entertainment

షారుక్ లైనప్​.. మోత మోగేలా ఉందే! - sharukh atlee movie

పఠాన్​తో బ్లాక్ బస్టర్లను అందుకు స్టార్ హీరో షారుక్ ఖాన్​ ప్రస్తుతం ఫుల్​ జోష్​లో ఉన్నారు. మరో రెండు భారీ చిత్రాలు చేస్తున్నారు. వాటి గురించే ఈ కథనం..

Pathaan success Sharuk khah next movies line up
షారుక్ లైనప్​.. మోత మోగేలా ఉందే!
author img

By

Published : Feb 7, 2023, 1:41 PM IST

పఠాన్ సెన్సేషనల్ హిట్​తో జోష్ మీదున్నాడు కింగ్ ఖాన్ షారుక్​. చాలా ఏళ్ల పాటు సరైన హిట్ లేకుండా ఫ్యాన్స్​ను వెయిటింగ్​లో పెట్టిన షారుక్​ ఎట్టకేలకు సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా కాలం పాటు కేవలం కథలపైనే బాగా దృష్టి పెట్టి వరుస సినిమాలను అనౌన్స్​ చేశారు. అలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత రీసెంట్​గా జనవరి 25న పఠాన్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తొలి రోజు నుంచే వసూళ్ల మోత మోగిస్తూ ఈ చిత్రం.. బాక్సాఫీస్​ను షేక్​ చేసి బాలీవుడ్​కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. నార్త్, సౌత్, ఓవర్సీస్​ అని తేడా లేకుండా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్​గా రూ.1000 కోట్ల క‌లెక్ష‌న్ల మార్కు దిశ‌గా దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం షారుక్​ ఖాన్​కు మంచి కమ్​ బ్యాక్ ఇచ్చింది.

అయితే ఇక షారుక్​ త‌ర్వాతి సినిమాల లైన‌ప్ చూస్తుంటే మరో రెండేళ్ల‌ పాటు కూడా ఎవ్వ‌రూ ఊహించలేని స్థాయిలో సక్సెస్​ అందుకుంటారని అని అర్థమవుతోంది. అదిరిపోయే కంటెంట్​లతో ఆయన రానున్నారు. ప్రస్తుతం ఆయన జ‌వాన్ సినిమాలో నటిస్తున్నారు. అది కూడా ఏ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ దీన్ని రూపొందిస్తున్నారు. ఆయన స్టార్ హీరోల‌కు అదిరిపోయే కమర్షియల్​ హిట్​లను అందించారు. ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్​తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా బాగా ఆకట్టుకుంటుందని సినీ వర్గాల అంచనా.

దీని త‌ర్వాత షారుక్​.. మరో స్టార్ డైరెక్టర్​​ రాజ్ కుమార్ హిరానితో డంకీ సినిమా చేస్తున్నారు. హిరానీ కెరీర్​ చూస్తే.. మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుంచి సంజు వ‌ర‌కు అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లే. ఆయన చిత్రాల్లో మంచి కంటెంట్​ ఉంటుంది. కాబట్టి ఇది కూడా బాగా ఆడే అవకాశాలు ఉన్నాయి. అలా ప‌ఠాన్​తో భారీ సక్సెస్​ను అందుకున్న షారుక్​.. జ‌వాన్​, డంకీతోనూ అదిరిపోయే హిట్లను అందుకునే అవకాశం ఉంది. మరి చూడాలి ఇవి ఫ్యాన్స్​ ఆశించేలా ఆడతాయో లేదో.

ఇదీ చూడండి: RC 15: రూ.15కోట్లతో మరో పాట.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.