ETV Bharat / entertainment

ఆస్కార్​కు అడుగు దూరంలో 'నాటు నాటు'.. ఆ పాటతోనే గట్టి పోటీ! - oscar awards 2023 latest news

ఆస్కార్​ పండగ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం యావత్​ ప్రపంచంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ల చిత్రమైన 'ఆర్​ఆర్​ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ఈ సారి ఆస్కార్​ రేస్​లో నిలిచింది. అయితే ఇప్పటికే ఎన్నో మెట్లను దాటుకొని బరిలో నిలిచిన ఈ పాటకు మరో సాంగ్​ గట్టి పోటీ ఇవ్వనుంది. అదేం పాటంటే?

Oscar Naatu Naatu 2023
ఆస్కార్​ అవార్డులు 2023
author img

By

Published : Mar 12, 2023, 6:12 PM IST

ఆస్కార్​ పండుగకు కౌంట్​డౌన్​ ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో ఈ వేడుకకు గ్రాండ్​గా వెల్​కమ్​ చెప్పనున్నారు సినీ ప్రేక్షకులు. అమెరికాలోని లాస్​ ఏంజిల్స్​ వేదికగా మార్చి 13 ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగే ఈ వేడుక జరగనుంది. అందుకు గాను వివిధ కేటగిరీల్లో నామినేట్​ అయిన సినిమాల బృందాలు ఇప్పటికే అమెరికా చేరుకున్నాయి.

ఒరిజినల్ సాంగ్ విభాగంలో తెలుగు సినిమా ఆర్​ఆర్​ఆర్​లోని 'నాటు నాటు' పాటతో సహా మరో ఐదు పాటలు పోటీలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌'(అప్లాజ్‌), 'హోల్డ్‌ మై హ్యాండ్‌'(టాప్‌గన్‌.. మావెరిక్‌), 'లిఫ్ట్‌ మీ అప్'(బ్లాక్‌ పాంథర్‌), 'దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌'(ఎవ్రీథింగ్‌ ఎవీవ్రేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) సినిమాల్లోని సాంగ్స్​ 'నాటు నాటు' పాటకు పోటీ ఇవ్వనున్నాయి. వీటిల్లో మార్వెల్‌ సూపర్‌ హీరో చిత్రం 'బ్లాక్‌పాంథర్‌: వకాండా ఫరెవర్‌'లో రిహానా పాడిన 'లిఫ్ట్‌ మీ అప్‌' లిరిక్స్​, టామ్‌ క్రూజ్‌ హీరోగా వచ్చిన 'టాప్‌ గన్‌ మావెరిక్‌' చిత్రంలో 'లేడీ గాగా' రాసి ఆలపించిన 'హోల్డ్‌ మై హ్యాండ్‌' సాంగ్ ఉన్నాయి. అంతేగాక ఇవి 'గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌'లో కూడా మన 'నాటు నాటు' గేయానికి గట్టి పోటీ ఇచ్చాయి. కానీ చివరికి నాటు నాటుకే అవార్డు వరించింది.

అయితే మరి కొద్ది గంటల్లో జరగబోయే ఆస్కార్​ బరిలోనూ రిహానా పాడిన 'లిఫ్ట్‌ మీ అప్‌' పాట 'నాటు నాటు'కు మరోసారి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌'(అప్లాజ్‌), 'టాప్‌ గన్‌ మావెరిక్‌' సినిమాలోని 'లేడీ గాగా' పాడిన 'హోల్డ్‌ మై హ్యాండ్‌' పాటలు ఆ తర్వాత వరుసలో 'నాటు నాటు'తో ఢీ అనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్​లోని ఈ పాట ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా చివరికి 'నాటు నాటు' పాట సహా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కాగా, భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్​కు ఎంపికైన తొలి ఇండియన్​ సినిమా పాట ఇదే.

మెగాపవర్​ స్టార్​ రామ్‌చరణ్‌, జూనియర్​ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. దీనికి ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేగాక గ్లోబల్​ బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీకి ఎమ్​ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. కాగా, దీంట్లోని 'నాటు నాటు' పాటను సింగర్స్​ రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ పాడారు. ప్రత్యేకంగా ఈ పాటకు కొరియోగ్రాఫర్​ ప్రేమ రక్షిత్​ మాస్టర్​ నృత్యరీతులు సమకూర్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.