ETV Bharat / entertainment

NTR Upcoming Projects : ఎన్టీఆర్ మాసివ్​ ప్లానింగ్​... మరో రెండేళ్ల పాటు గ్యాప్ లేకుండా.. కొత్త ప్రాజెక్ట్స్​​ వివరాలివే! - ntr prasanth neel movie updates

Ntr Upcoming Projects : యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ లైనప్​ భారీ స్థాయిలో ఉంది. ఆయన తర్వాత చేయబోయే సినిమాల లైనప్​ చూస్తుంటే.. మరో రెండేళ్ల పాటు గ్యాప్ లేకుండా షెడ్యూల్స్​ ఉన్నాయి. ఆ వివరాలు..

Ntr Upcoming Projects :  ఎన్టీఆర్ మాసివ్​ ప్లానింగ్​... భారీ రేంజ్​లో లైనప్​..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 4:09 PM IST

NTR Upcoming Projects : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' నుంచి వచ్చిన రెండు భాగాల లేటెస్ట్ అప్డేట్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. దర్శకుడు కొరటాల శివ ఓ స్పెషల్ వీడియోతో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పారు. 2024 ఏప్రిల్ 5న మొదటి భాగం రానున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అయితే దేవర మొదటి భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్​కు డేట్స్ ఇస్తారని తెలిసింది. 2024 ప్రారంభం నుంచి ఆ చిత్రానికి సమయం కేటాయిస్తారట. మరోవైపు 'కేజీయఫ్' ఫేమ్​ ప్రశాంత్ నీల్​తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమాను లైన్​లో పెట్టిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా కూడా 2024లోనే చేయాల్సి ఉంటుంది. అంటే 2024 లో ఎన్టీఆర్ 'వార్ 2'తో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమా కోసం పని చేస్తారని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత 'దేవర 2' కోసం.. ఎన్టీఆర్​ రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. కొరటాల శివకు డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. 'దేవర 2' తర్వాత అరవింద సమేత కాంబో దర్శకుడు త్రివిక్రమ్​తో కలిసి పనిచేయనున్నారని టాక్​ వినిపిస్తోంది. ఇది సెట్స్​పైకి వెళ్లేసరకి 2025 పట్టొచ్చు.

ఇకపోతే ఎన్టీఆర్​తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. 'వార్ 2'తో ఇప్పటికే అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్​ను డైరెక్ట్ చేయనున్నారు. 'వార్ 2'లో తారక్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలిసింది. ఎలాంటి పాత్ర అయినా సరే తన మార్క్ యాక్టింగ్​తో ఎన్టీఆర్ మెప్పించగలరు. దీంతో ఆయనకు బాలీవుడ్​లో మరిన్ని అవకాశాలు రావొచ్చు. అయితే తారక్​ తనకున్న ఛాయిన్​ ఆధారంగా సౌత్​ దర్శకులతోనా లేదా నార్త్​ డైరెక్టర్స్​తో చేస్తారా అనేది చూడాలి.

ఇలా దేవర 1, వార్ 2, ప్రశాంత్ నీల్​తో సినిమా, దేవర 2, ఆ తర్వాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాల లైనప్ భారీగానే ఉంది. అయితే వీటిలో ఏది ముందు ఏది వెనక్కి అన్నది ఇప్పుడెంత మాట్లాడుకున్న.. అవి సెట్స్ మీద వెళ్లాక డిసైడ్ అవుతుంది. ఎన్టీఆర్ కూడా ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలతో కెరీర్​లో మరింత పీక్ స్టేజ్​కు వెళ్లాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.

NTR Devara Update : రెండు పార్ట్​లుగా NTR 'దేవర'.. డైరెక్టర్ కొరటాల శివ వీడియో రిలీజ్​

Janhvi Kapoor Hyderabad House : హైదరాబాద్​లో ఇల్లు కొన్న 'దేవర' బ్యూటీ​.. వామ్మో ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.