Adipurush Action Trailer : ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇతిహాసగాథ 'ఆదిపురుష్'. కృతిసనన్ సీతగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా యాక్షన్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. 2 నిమిషాల 27 సెకన్ల పాటు సాగిన ఈ ప్రచారం చిత్రం ఆద్యంతం పోరాట సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.
మొదటి ట్రైలర్‌లో రాముడి భావోద్వేగాలను చూపించిన మూవీటీమ్.. ఈ రెండో ప్రచార చిత్రంలో సీతను రావణుడు ఎలా అపహరించాడు, ఈ వార్త తెలియగానే శ్రీరాముడు యుద్ధానికి ఎలా బయలు దేరాడు, ఎలా యుద్ధం చేశాడు వంటి సన్నివేశాలను చూపించారు. "న్యాయం నా రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి. అధర్మాన్ని అంతం చేయడానికి వస్తున్నా" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ప్రభాస్ బేస్ వాయిస్‌తో రోమాలు నిక్కపొడిచేలా ఉన్న ఈ ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్... అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ట్రైలర్ రివ్యూ.. ఈ తాజా ట్రైలర్‌తో రెండు అంశాలపై మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ సినిమాలో రావణ సంహారం ఎపిసోడ్ కళ్లుచెదిరే రేంజ్లో ఉండబోతోందనే విషయం ఫైనల్ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక రెండో అంశం ఏంటంటే.. సినిమాలో గ్రాఫిక్స్ ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాను త్రీడీలో మాత్రమే చూడాలనే ఉత్సుకతను రేకెత్తించారు.
తాజా ట్రైలర్లోనూ లంకా దహనం, రావణ సంహారం, హనుమంతుడు సీతను చేరుకోవడం లాంటి ఎపిసోడ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవానికి యాక్షన్ ట్రైలర్ అన్నారు కానీ.. అంతకన్నా ఎక్కువగా.. వానర సేనను యుద్ధానికి సన్నద్ధం చేస్తూ రాఘవుడు చెప్పే డైలాగ్సే ఈ ఫైనల్ ట్రైలర్‌లో బాగా హైలైట్‌గా నిలిచాయి. మొత్తంగా తెలిసిన కథని గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించారు.
రావణుడికి మళ్లీ నో స్పేస్.. ఇక తొలి సారి టీజర్ విడుదల చేసిన రావణుడి లుక్స్‌పై ఫుల్ కాంట్రవర్సీ అయింది. ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి. అందుకే తొలి ట్రైలర్‌లో రావణుడి జోలికి పోకుండా చూపించారు. ఇప్పుడు మళ్లీ అదే చేశారు. రెండో ట్రైలర్లోనూ రావణుడిని అంతగా టచ్ చేయలదు. కేవలం భిక్షాటన చేస్తున్న గెటప్‌లోనే చూపించారు. కానీ అసలు రూపం చూపించలేదు. ఒకటి రెండు సీన్లను చూస్తుంటే లంకను, రావణాసురుడిని భయంకరంగానే చూపించినట్లు అర్థమవుతోంది.