Hero Maheshbabu Sitara: నాలుగు పదుల వయసు దాటినా.. రోజురోజుకూ మరింత యంగ్‌గా కనిపిస్తున్న హీరో మహేశ్ బాబు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది.
అయితే ఆదివారం వరల్డ్ డాటర్స్‌డే సందర్భంగా.. తన కుమార్తెకు శుభాకాంక్షలు చెప్పారు మహేశ్ బాబు. "నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారి సితార ఘట్టమనేనికి డాటర్స్‌డే శుభాకాంక్షలు" అంటూ ఆయన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మహేశ్, సితార కలిసి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తుంటారు. కొద్దిరోజులుగా పలు టీవీ షోలకు సైతం ఇద్దరూ కలిసి వెళ్తున్నారు.
మరోవైపు, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్.. తన కుమార్తె నితార పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చదవండి: మొన్న గుర్రపు స్వారీ.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్.. ఆ సినిమా కోసం కాజల్ హార్డ్ వర్క్!