Leo Movie Day 2 Collections : కోలీవుడ్ స్టర్ దళపతి విజయ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ యాక్షన్ గ్యాంగస్టర్ మూవీ 'లియో'. భారీ అంచనాలతో అక్టోబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్‌ను సాధించగా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. రెండో రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఓసారి గమనిస్తే...
తెలుగు రాష్ట్రాల్లో లియో బిజినెస్ విషయానికి వస్తే... రూ.16 కోట్ల వరకు చేసుకుందట. అంటే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే.. రూ.17 కోట్ల షేర్ అందుకోవాలి. రెండోరోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వివరాల విషయానికి వస్తే... రూ.3.6 కోట్ల షేర్ - రూ.6కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలుగులో రెండు రోజుల్లో.. రూ.11 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్ట్ చేసిందట. అంటే ఈ చిత్రానికి ఇంకో రూ.6 కోట్ల షేర్ రావాలి.
వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రూ.140కోట్ల గ్రాస్ వచ్చాయి. ఇక ఇండియావైడ్‌గా తొలి రోజు రూ.74కోట్ల గ్రాస్ - రూ.64.80కోట్ల నెట్ వసూళ్లు రాగా, రెండో రోజు శుక్రవారం రూ. 42.50 కోట్ల గ్రాస్ - రూ.36కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయట. అంటే రెండో రోజు కాస్త జోరు తగ్గిందన్నమాట. అందులో తమిళనాడు నుంచి రూ.24కోట్ల గ్రాస్ రాగా, ఆంధ్రా-తెలంగాణ రూ.6కోట్ల గ్రాస్, కేరళ రూ.6కోట్ల గ్రాస్, కర్ణాటక రూ.4.50కోట్ల గ్రాస్ వచ్చాయట. మొత్తంగా ఇండియాలో రూ.100కోట్లకు చేరుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినిమా రివ్యూ విషయానికొస్తే(Leo Movie Review).. విజయ్ నటన, ఫ్లాష్‌బ్యాక్‌లో ఫైట్ సీన్స్, విరామ సన్నివేశాలు బలాలుగా నిలిచాయి. ద్వితీయార్ధం కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్, హైనాతో ఫైట్ సీక్వెన్స్ బలహీనతలుగా ఉన్నాయి. మొత్తంగా యాక్షన్ ప్రియుల్ని మెప్పించే లియో అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటించగా.. మడొన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్ సర్జా కీలక పాత్రల్లో నటించారు.
Bhagvant Kesari Day 2 Collections : 'భగవంత్ కేసరి'.. తీవ్ర పోటీలోనూ బాలయ్య జోరు!