ETV Bharat / entertainment

సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఫస్ట్​ డే ఇంత తక్కువా?.. గత పదేళ్లలో తొలిసారి ఇలా!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. నటించిన కొత్త చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. సల్మాన్ కెరీర్​లోనే అతి తక్కువ ఓపెనింగ్స్​ను అందుకుంది.

kisi-ka-bhai-kisi-ki-jaan-collections
సల్మాన్​ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఫస్డ్​ డే కలెక్షన్స్​ ఇంత తక్కువా
author img

By

Published : Apr 22, 2023, 3:41 PM IST

kisi ka bhai kisi ki jaan collection : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. చాలా కాలంగా ఈద్ బాక్సాఫీస్ బరిలో దిగి సూపర్ సక్సెస్​ను అందుకుంటున్నారు. అలానే ఈ సారి కూడా 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'తో ఆడియెన్స్​ను అలరించారు. అయితే ఈ సారి ఆయనకు పరాజం పలకరించింది. ఫస్ట్​ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ఫ్యాన్స్​.. ఈ మూవీ నచ్చలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి.. ఈ చిత్రం రిలీజ్​కు ముందు నుంచే నెగటివ్​ టాక్​ తెచ్చుకుంది. పోస్టర్స్​, టీజర్​, ట్రైలర్​, సల్మాన్​ డ్యాన్స్.. ఇలా ప్రతీది ట్రోల్స్​ అయ్యాయి. దీంతో సినిమాపై హైప్​ క్రియేట్​ అవ్వలేదు. అప్పటికీ మూవీటీమ్​ ఎంత బజ్​ క్రియేట్​ చేయడానికి ప్రయత్నించినా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో ఆ ఎఫెక్ట్​ ఫస్ట్ డే కలెక్షన్స్​పై పడింది.

ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే.. సల్మాన్ భాయ్​ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఫస్ట్​ డే.. కేవలం రూ.15 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా సల్మాన్ ఖాన్ కెరీర్​లో ఇదే అతి తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్​. ఈద్​ సందర్భంగా విడుదలైన ఆయన చివరి పది సినిమాలు చూస్తే ఇదే అతి తక్కువని చెప్పాలి. ఈ చిత్రాలకు సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్స్​ వివరాలు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్​ ట్వీట్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దబాంగ్'.. సల్మాన్​కు బిగ్గెస్ట్​ హిట్​. అప్పట్లో ఆ సినిమా రూ. 14.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' చిత్రం రూ. 15.81 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే లెక్కల పరంగా 'దబాంగ్' కన్నా కిసీ కీ జాన్​ సినిమాకు ఎక్కువ వచ్చినప్పటికీ.. అప్పటి టికెట్ రేట్లకు- ఇప్పటి రేట్లను పోలీస్తే.. ఇది చాలా తక్కువ అని చెప్పాలి. ఇక 2011లో బాడీగార్డ్​ రూ.21.60 కోట్లు, 2012లో ఏక్​ ది టైగర్​ 32.93 కోట్లు, 2014లో కిక్​ రూ.26.40 కోట్లు, 2015లో భజరంగీ భాయ్​జాన్​ రూ.27.25 కోట్లు, 2016లో సుల్తాన్​ రూ.36.54 కోట్లు, 2017లో టూబ్​లైట్​ 21.15 కోట్లు, 2018లో రేస్​ 3- 29.17 కోట్లు వసూలు చేశాయి. అంటే ఈ పన్నెండేళ్లలో సల్మాన్​ ప్రతి సినిమా ఓపెనింగ్​ కలెక్షన్స్ దాదాపు రూ.20కోట్లు వసూళ్లు చేశాయి. కిసీ కీ జాన్​ కన్నా ఎక్కువ వసూలు చేశాయి.

కాగా, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్​.. తమిళంలో అజిత్‌ నటించిన 'వీరమ్‌' సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో ఇదే చిత్రాన్ని 'కాటమరాయుడు'గా పవన్‌కల్యాణ్‌ నటించారు. కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఇదే చిత్రంతో సల్మాన్‌ 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'గా ముందుకొచ్చారు. తెలుగు హీరో వెంకటేశ్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. రామ్​చరణ్​ గెస్ట్​గా మెరిశారు.

ఇదీ చూడండి: మొన్న 'బలగం'.. ఇప్పుడు 'విరూపాక్ష'.. బాక్సాఫీస్​ వద్ద 'కాకి' కాసుల వర్షం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.