ETV Bharat / entertainment

'స్పిరిట్'​పై కియారా రియాక్షన్​.. 'విక్రమ్'​లో సూర్య కన్ఫామ్​! - ప్రభాస్ స్పిరిట్​

ప్రభాస్ నటించాల్సిన​ 'స్పిరిట్'​ సినిమాలో హీరోయిన్​గా కియారా అద్వాణి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై ఆమె టీమ్ స్పందించింది. దీంతోపాటే కమల్​హాసన్​ 'విక్రమ్'​ సినిమాలో కథానాయకుడు సూర్య నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్​.

Kiara Advani spirit
కియారా అద్వాణి స్పిరిట్​
author img

By

Published : May 16, 2022, 6:12 PM IST

Spirit movie kiara advani: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​- 'అర్జున్​రెడ్డి' ఫేమ్​ దర్శకుడు సందీప్​వంగా దర్శకత్వంలో 'స్పిరిట్'​ సినిమా త్వరలో తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్​ పాత్ర కోసం కియారా అద్వాణీ-రష్మిక పోటీ పడుతున్నట్లు ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన కియారా ఆ వార్తలను కొట్టిపారేసింది. కియారాకు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. "స్పిరిట్​ చిత్రం కోసం ఎవరూ కియారాను సంప్రదించలేదు. ఒకవేళ సినిమా కన్ఫామ్​ అయితే కియారా లేదా ఆమె టీమ్​ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తారు" అని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్​ 'సలార్'​, 'ప్రాజెక్ట్​ కె' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు సందీప్ వంగా కుడా యానిమల్​ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇవి పూర్తవ్వగానే స్పిరిట్​ సెట్స్​పైకి వెళ్తుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో రిలీజ్​ చేయనున్నారు.

Suriya in kamlahassan vikram movie: యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ నటిస్తున్న విక్రమ్​లో మరో స్టార్​ హీరో సూర్య నటిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్​. సూర్య సినిమాలోని ఓ పవర్​ఫుల్​ పాత్రలో కనిపిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్స్​ విజయ్ సేతుపతి, ఫహద్​ ఫాజిల్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్​లో​ కమల్​తో పాటు వీరి యక్షన్ కూడా​ అదిరిపోయింది. కాగా, ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుధ్‌ స్వరాలందించారు. జూన్‌ 3న సినిమా రిలీజ్​ కానుంది.

ఇదీ చూడండి: ఓటీటీలోకి 'కేజీయఫ్​'.. బిగ్​బీపై ట్రోల్స్​.. 'మేజర్' అప్డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.