ETV Bharat / entertainment

'కేజీయఫ్​ 2' @1000కోట్లు.. 'ఆచార్య' తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ తొలి రొజు మంచి వసూళ్లనే సాధించింది . మరోవైపు యశ్​ కేజీయఫ్​ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టింది.

acharya collections
ఆచార్య కలెక్షన్స్​
author img

By

Published : Apr 30, 2022, 12:17 PM IST

Updated : Apr 30, 2022, 12:45 PM IST

KGF 2 1000 crores: ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన చిత్రం 'కేజీయఫ్‌-2'. ఈ సినిమా సాధించిన విజయంతో యశ్ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. రాఖీభాయ్‌గా స్టైల్‌, యాక్షన్‌తో అద్భుతంగా డైలాగ్స్‌ చెప్పి సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏప్రిల్​ 14న విడుదలైన ఈ మూవీ తొలి రోజు నుంచే సూపర్​హిట్​ టాక్​తో దూసుకెళ్తూ ఇంకా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలీవుడ్​లో అయితే హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని.. వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే బీటౌన్​లో రూ.350కు కోట్లకు పైగా కలెక్షన్లను అందుకొని.. ఆల్ టైమ్​ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రూ.వెయ్యి కోట్ల క్లబ్​లోకి అడుగుపెట్టింది.

Acharya First day collections: మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకుడు. పూజాహెగ్డే హీరోయిన్​. భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మిక్స్​డ్ టాక్​ తెచ్చుకుంది. అయినప్పటికీ తొలి రోజు మంచి వసూళ్లను అందుకుందని తెలిసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.29.50కోట్ల షేర్​ రాగా రూ.40కోట్ల గ్రాస్​ సాధించినట్లు ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెస్టాఫ్​ ఆఫ్​ ఇండియా, ఓవర్​సీస్​ అంతా కలిపి రూ.35కోట్లు షేర్ రాగా మొత్తంగా రూ.52.05కోట్ల గ్రాస్​​ వచ్చినట్లు సమాచారం.

  • నైజాం - రూ.7.99కోట్లు
  • సీడెడ్​ - రూ.4.60కోట్లు
  • ఉత్తరాంధ్ర - 3.61కోట్లు
  • ఈస్ట్​ - 2.53 కోట్లు
  • వెస్ట్​ - 2.90కోట్లు
  • గుంటూరు - 3.76కోట్లు
  • కృష్ణా - 1.90కోట్లు
  • నెల్లూరు - 2.30కోట్లు

ఇదీ చూడండి: 'మిషన్ ఇంపాజిబుల్' సీక్వెల్స్​ రిలీజ్ డేట్స్ ఇవే!

Last Updated : Apr 30, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.