ETV Bharat / entertainment

చెప్పు దాడి తర్వాత తొలిసారి స్పందించిన స్టార్ హీరో - దర్శన్​పై దాడి

ఇటీవల తనపై జరిగిన చెప్పు దాడి గురించి కన్నడ నటుడు దర్శన్‌ తొలిసారి స్పందించారు. ఏమన్నారంటే..

Darshan chappel attack
చెప్పు దాడి తర్వాత తొలిసారి స్పందించిన స్టార్ హీరో
author img

By

Published : Dec 22, 2022, 1:55 PM IST

Updated : Dec 22, 2022, 2:00 PM IST

ఇటీవల తనపై జరిగిన చెప్పు దాడి గురించి కన్నడ నటుడు దర్శన్‌ తొలిసారి స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు చెప్పారు. "ఈ సమయంలో నాకంటే నా సహ నటీనటులు ఎక్కువగా బాధపడుతున్నారని అర్థమైంది. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచవు. మరింత దృఢంగా మారుస్తాయి. మన సొంత కన్నడ నేలపైనే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు చూశాం. న్యాయం కోసం నిలబడిన స్నేహితులు, నటీనటులకు ధన్యవాదాలు. సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకూ కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ఉంటే.. కొన్ని వేల మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగుతారని నేను మొదటి నుంచే చెబుతున్నాను. అదే జరిగింది. నాపై పలువురు వ్యక్తులు కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా" అని దర్శన్‌ పేర్కొన్నారు.

దర్శన్‌ హీరోగా నటిస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'క్రాంతి' జనవరిలో విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేయడం కోసం చిత్రబృందం హోస్‌పేట్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. టీమ్‌ మొత్తం స్టేజ్‌పై ప్రసంగిస్తోన్న తరుణంలో ఓ వ్యక్తి దర్శన్‌ మీదకు చెప్పు విసిరాడు. అయితే, కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు దర్శన్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు సభాప్రాంగణంలో గొడవ పడ్డారని, కాబట్టి పునీత్‌ అభిమానే ఇలా చేశారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై కన్నడ చిత్రపరిశ్రమ అసంతృప్తి వ్యక్తం చేసింది. కిచ్చా సుదీప్‌, శివరాజ్‌కుమార్‌, ధనుంజయ్‌, రమ్య తదితరులు దర్శన్‌కు సపోర్ట్‌ చేశారు.

ఇదీ చూడండి: ఆ హీరోయిన్ నేను హాట్ పెయిర్​: యంగ్​ బ్యూటీపై బాలయ్య కామెంట్స్​

Last Updated : Dec 22, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.