ETV Bharat / entertainment

షాకింగ్​.. రూ.60 కోట్ల బడ్జెట్​తో స్టార్ హీరోయిన్​ చిత్రం.. రూ.6 కోట్లు కూడా రాలేదు! - tejas movie review

Kangana Ranaut Tejas Collections : కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం తేజస్‌ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా నిరాశపరిచింది. రూ.60 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తే రూ.6 కోట్లు కూడా వసూళ్లు రాలేదు. ఆ వివరాలు..

Kangana Ranaut Tejas Collections : షాకింగ్​.. రూ.60 కోట్ల బడ్జెట్​.. రూ.6కోట్లు కూడా రాలేదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 8:47 AM IST

Kangana Ranaut Tejas Collections : బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్​, కాంట్రవర్సీ క్వీన్​ కంగనా రనౌత్‌ కెరీర్‌.. ప్రస్తుతం వరుస పరాజయాలతో కొనసాగుతోంది. మణికర్ణిక తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆడలేదు. గత నెలలో రిలీజైన 'చంద్రముఖి 2' ఫ్లాప్​ అవ్వగా.. ఇప్పుడు తేజస్​ కూడా బోల్తా కొట్టింది. సర్వేష్‌ మేరావ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.60 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తే రూ.6 కోట్లు కూడా వసూళ్లు రాలేదు. దీంతో ట్రేడ్‌ వర్గాలే నోరెళ్ల బెడుతున్నాయి.

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తేజస్‌ చిత్రం దారుణమైన ఓపెనింగ్స్‌ను తెచ్చుకుంది. తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.1.25కోట్ల కలెక్షన్స్​ అందుకోగా.. సోమవారం వరకు రూ.4.25 కోట్ల వరకు అందుకుంది. ఇక మంగవారం పెద్దగా ఏమీ రాలేదంట. శని, ఆదివారాల్లో చాలా థియేటర్‌లలో 10-12 మంది మాత్రమే ఆడియెన్స్ కనిపించారని తెలిసింది. సోమవారం అయితే పలు థియేటర్లలో ఏకంగా షోలనే రద్దు చేశారట. రీసెంట్​గా బాలీవుడ్​లో రిలీజైన​ చిత్రాల్లో అతి తక్కువ వసూళ్లను అందుకున్న సినిమాల జాబితాలో ఇప్పుడు తేజస్‌ చేరిపోయింది.

ఇకపోతే 2015లో 'తను వెడ్స్‌ మను'తో ఘన విజయాన్ని అందుకుంది కంగనా రనౌత్. ఆ తర్వాత 'మణికర్ణిక'తో కేవలం కలెక్షన్స్​ మాత్రమే కాదు మంచి పేరును కూడా సంపాదించుకుంది. అయితే ఈ సినిమా సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. కానీ ఆమె యాక్టింగ్​కు ఫిదా అయిన ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె నటించిన 'జడ్జిమెంట్‌ హై క్యా', 'పంగా', 'తలైవి', 'ధాకడ్‌', 'చంద్రముఖి 2' అన్నీ నిరాశ పరిచాయి. ధాకడ్‌ అయితే మొత్తంగా రూ.2.58 కోట్లే వసూలు చేసిందట. ఇక ఇప్పుడు కంగన ఆశలన్నీ 'ఎమర్జెన్సీ' చిత్రంపైనే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషించింది. భారతదేశం ఎమర్జెన్సీ సమయంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Devara Janvi Kapoor Look : జాన్వీ పాత్ర ఇదే.. లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా.. తారక్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Tollywood Hit Combinations Repeat : 12 సాలిడ్​​ కాంబోలు రెడీ​.. ఆడియెన్స్​లో భారీ​ హైప్​.. ఆ 5 మాత్రం బ్యాలెన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.